Pawan Kalyan : ఉత్కంఠగా మారబోతున్న పొలిటికల్ ఫైట్.. పవన్ వర్సెస్ జగన్‌పై అందరిలో ఆసక్తి..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : ఉత్కంఠగా మారబోతున్న పొలిటికల్ ఫైట్.. పవన్ వర్సెస్ జగన్‌పై అందరిలో ఆసక్తి..!
Pawan Kalyan : గడిచిన కొద్ది కాలం నుండి ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తుండగా, మరోవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అయితే జగన్ ఓటమికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కారణమని చాలా మంది విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ కూడా అన్ని ప్రాంతాలలో తిరిగి తన ప్లాన్ అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే జగన్ తన నిరసనల కార్యాచరణ ఖరారు చేసారు. ఈ నెల 11వ తేదీ నుంచి వరుసగా మూడు అంశాల పైన పోరుబాటకు సిద్ధం అయ్యారు. సంక్రాంతి తరువాత జగన్ వరుసగా పార్లమెంట్ స్థానాల వారీగా పర్యటనలు చేయనున్నారు.
Pawan Kalyan ఢీ అంటే ఢీ..
ప్రతీ బుధ, గురు వారం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు – కేడర్ తో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఇటు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అదే విధంగా పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది .ఇక జగన్ ఇలాకాలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతుండడం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఫస్ట్ టైమ్ కడప గడపకు చేరుకుంటున్నారు. దాంతో జగన్ ఇలాకాలో పవన్ ఈ విధంగా అధికార హోదాతో రావడంతో రాజకీయంగా అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7న కడప జిల్లాకు రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆ రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్ గా కడప ఎయిర్ పోర్టులో దిగుతారు. అక్కడ నుంచి ఆయన కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగులో పాల్గొంటారు అని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి అయితే ఉప ముఖ్యమంత్రి కడప జిల్లా షెడ్యూల్ ఇదే అని తెలుస్తోంది.ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాణ్ జిల్లాలోని జనసేన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు అని అంటున్నారు. ఆ తరువాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు అని అంటున్నారు.