Pithapuram Varma : ఒకప్పుడు పిఠాపురం పేరు అందరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ Pawan Kalyan అక్కడ నుండి పోటీ చేశారో ఒక్కసారిగా పిఠాపురం పేరు మారుమ్రోగింది. అయితే అప్పటికే అక్కడ పవర్ ఫుల్ లీడర్‌గా ఉన్న వర్మని కాదని పవన్ సీటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన ఆ తర్వాత.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా.. కనీసం ప్రాధాన్యం దక్కడంలేదని వర్మ గురించి అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పవన్ ప్రసంగంలోనూ వర్మ గురించి ప్రస్తావించారు. వర్మతో సహా అందరినీ కలుపుకుని ప్రజల సమస్యల సాధనకు కృషి చేస్తామని అన్నారు.
వర్మ గత నాలుగు మాసాలుగా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనీ రాజకీయ నేతలు పలు మార్లు చర్చించారు. ఇటీవల కోడిపందేల బరుల విషయంలోనూ వర్మ వర్గానికి చేదు అనుభవాలు పెరిగిపోయాయి.ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వర్మకు ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్మని తనతోపాటు వేదికపైనా కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసాంతం వర్మ Varma ఖుషీ అయ్యారు. ఆనందంగా గడిపారు. అయితే.. దీనికి ముందు జరిగిన చర్చల వ్యవహారంపైనే ఆసక్తి నెలకొంది. పిఠాపురానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ను ముందుగానే వర్మ భేటీ అయినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ క్రమంలో వర్మకు పవన్ కల్యాణ్‌ను బలమైన హామీ లభించినట్టు తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వర్గంలో చోటు లభించలేదు. అలాగని వర్మ ఎక్కడా బయటపడలేదు. ఎక్కడా యాగీ కూడా చేయలేదు. క్షత్రియ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్ Chairaman పదవిని సృష్టించి.. ఆ పదవిని వర్మకు ఇచ్చే ఆలోచన ఉందని వర్మ అనుచరులు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ నుంచి బలమైన హామీ దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్యక్రమంలో వర్మ ఖుషీ అయినట్టు తెలుస్తోంది. రానున్న రోజులలో దీనిపై క్లారిటీ రానుంది.
Padi Kaushik Vs Sanjay : కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో గందరగోళం నెలకొంది. బిఆర్ఎస్ హుజురాబాద్…
Kodi Pandalu : సంక్రాంతి Pongal పండగ వచ్చిందంటే చాలు మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి…
Nallari kiran kumar reddy : ఈ మధ్య కాలంలో వైఎస్ ఫ్యామిలీ ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే…
Viral Video తెలంగాణలో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనావాసాలలోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఒక గుంటనక్క…
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు…
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా…
Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే…
Jasmine : మల్లెపూలు అందరూ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మల్లెపూల Jasmine యొక్క సువాసన మరియు మల్లెపువ్వు తెలుపు రంగును…
This website uses cookies.