PF Scheme : ఉద్యోగుల భవిష్యత్‌కు ఈ పథకం ఎంతో మేలు..!
ప్రధానాంశాలు:
ఉద్యోగుల భవిష్యత్‌కు ఈ పథకం ఎంతో మేలు..!
PF scheme : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలలో ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత కల్పించడంలో ప్రావిడెంట్ ఫండ్ (PF) పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పని చేసే వారి కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా ఉద్యోగ కాలం ముగిసిన తర్వాత విశ్రాంత జీవితం ఆర్థికంగా నిర్భంధంగా గడిపే అవకాశం కల్పించబడుతుంది. చిన్న మొత్తంలో జీతం పొందే ఉద్యోగులకైనా ఈ పథకం ద్వారా పదవీ విరమణ నాటికి కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

PF Scheme : ఉద్యోగుల భవిష్యత్‌కు ఈ పథకం ఎంతో మేలు..!
PF scheme : తక్కువ జీతం ఉన్నవారికీ పీఎఫ్ పథకం గొప్ప వరం
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలపై వార్షికంగా 8.25% వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి కొనసాగించాలని నిర్ణయించింది. ఇక ఓ వ్యక్తి నెలకు రూ.25,000 జీతం పొందుతూ, 30 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరితే, 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అంటే 30 సంవత్సరాల పాటు పీఎఫ్‌లో కంట్రిబ్యూషన్ చేస్తూ వస్తే, అప్పుడు ఆయన ఖాతాలో రూ.1,21,32,962 జమవుతుంది. దీనిలో ఉద్యోగి వాటా (12%)తో పాటు యజమాని కూడా సుమారు అంతే మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తారు. ఈ మొత్తం వడ్డీతో కలిసి పెరిగిపోతుంది.
ఈ లెక్కల ప్రకారం తక్కువ జీతం ఉన్నవారికీ పీఎఫ్ పథకం భవిష్యత్తులో పెద్ద భద్రతను అందించగలదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేటు పెరిగితే ఈ మొత్తం మరింత పెరగొచ్చు. దీని వలన ఉద్యోగులు తక్కువ జీతంతో కూడిన ఉద్యోగాలను కూడా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నమ్మకంగా కొనసాగించవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ పథకం ద్వారా సముదాయించే ఈ నిధి, పదవీ విరమణ తర్వాత జీవనోపాధికి పునాదిగా నిలిచే ఒక శాశ్వత సంపదగా మారుతుంది