Ac Price Cut | నేటి నుంచి టీవీలు, ఏసీలు, డిష్‌వాషర్లపై భారీ తగ్గింపు .. జీఎస్టీ రేట్ల కోతతో వినియోగదారులకు పండగ
Ac Price Cut | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలు నేటి నుంచే (సెప్టెంబర్ 22) దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా గృహోపయోగ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో, టాప్ బ్రాండ్స్ భారీ ధర తగ్గింపులు ప్రకటించాయి. ముఖ్యంగా టెలివిజన్లు, ఏసీలు, డిష్ వాషర్లు వంటి పరికరాలపై వినియోగదారులకు స్పష్టమైన లాభాలు కనిపించనున్నాయి. ఈ తగ్గింపులు పండగ సీజన్‌కు మినీ బొనాంజా లా మారాయి.
#image_title
టీవీలపై భారీ డిస్కౌంట్లు
ఇంతవరకూ 28%గా ఉన్న 32 అంగుళాల పైబడి టీవీల జీఎస్టీ రేటు ఇప్పుడు 18%కు తగ్గడంతో కంపెనీలు కూడా తక్షణమే తగిన తగ్గింపులు ప్రకటించాయి.
సోనీ ఇండియా
43 అంగుళాల బ్రేవియా 2: రూ. 59,900 నుండి రూ. 54,900 తగ్గింపు
55 అంగుళాల మోడల్: రూ. 2.80 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు
98 అంగుళాల టాప్ ఎండ్ టీవీ: రూ. 9 లక్షల నుంచి రూ. 8.29 లక్షలకు తగ్గించారు.
ఎల్‌జీ ఇండియా
43 అంగుళాల మోడల్: రూ. 30,990 నుండి రూ. 28,490
65 అంగుళాల టీవీ: రూ. 71,890నుండి రూ. 68,490
100 అంగుళాల టీవీ: రూ. 5,85,590 నుండి రూ. 4,99,790 తగ్గింపు
పానాసోనిక్
55 అంగుళాల టీవీ: రూ. 7 వేల వరకు తగ్గింపు
65 అంగుళాల టాప్ మోడల్: రూ. 26 వేల వరకు తగ్గింపు
75 అంగుళాల మోడల్: రూ. 32 వేల వరకు తగ్గింపు
ఏసీలు, డిష్‌వాషర్ల ధరలు కూడా డౌన్!
జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఏసీలు, డిష్ వాషర్లు వంటి ఇతర గృహోపయోగ వస్తువులపై కూడా పడింది.
ఏసీలు – సగటున రూ. 4500 వరకు తగ్గింపు
డిష్ వాషర్లు – గరిష్టంగా రూ. 8000 వరకు తగ్గింపు
హైయర్, వోల్టాస్, పానాసోనిక్, గోద్రెజ్ వంటి సంస్థలు ఇప్పటికే కొత్త ధరలతో తమ ఉత్పత్తులను డీలర్లకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించాయి.