Plane Crash: అగ్రరాజ్యం అమెరికాలో బిల్డింగ్‌పై కూలిన విమానం .. ఇద్దరు మృతి
ప్రధానాంశాలు:
Plane Crash: అగ్రరాజ్యం అమెరికాలో బిల్డింగ్‌పై కూలిన విమానం .. ఇద్దరు మృతి
Plane Crash: ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల దక్షిణకొరియా, కజకిస్థాన్‌లలో వరుసగా జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలను మరువక ముందే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో America మరో ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్నవిమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఓ భవనం రూఫ్‌టాప్‌పై ఫ్లైట్ కుప్పకూలడంతో ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Plane Crash ఘోర ప్రమాదం..
ఫుల్లెర్టోన్‌లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో Orange County city ఈ ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2.09 గంటల సమయంలో ఘటన జరిగిందని పోలీసులు వివరించారు.సౌత్ కాలిఫోర్నియాలోని California ఆరెంజ్ కౌంటీ నగరం ఫులర్టన్ Fullerton లో జరిగిన ప్రమాదంతో పెద్ద ఎత్తున పొగ ఎగసిపడింది.
దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 18 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.