
Plane Crash : దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో అందరు 179 మృతి
Plane Crash : ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఊహించని విధంగా జరుగుతున్న ప్రమాదాలు అందరు నోరెళ్లపెట్టేలా చేస్తున్నాయి. దక్షిణ కొరియాలో విమానం పేలిన ఘటనలో 179 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మాత్రమే సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండింగ్ కావాల్సిన ఆ విమానం రన్ వే పై అదుపు తప్పి.. గోడను ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ విమానంలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులతో కాలి బూడిదయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది.. ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మిగిలిన వారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.
Plane Crash : దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. విమానంలో అందరు 179 మృతి
ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతోనే ఈ విమానం అదుపు తప్పి రన్ వేపై దూసుకువెళ్లి ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. తదుపరి చర్యలు చేపడుతున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాకుని బయల్దేరిన “ది జేజు” ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 విమానం.. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పడంతో రన్ వేపై అతివేగంగా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టు రక్షణ గోడను ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఇక విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా.. ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని.. ఈ సమస్య కారణంగానే విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
సియోల్‌కు దక్షిణంగా 290 కిలోమీటర్లు (180 మైళ్ళు) దూరంలో ఉన్న మువాన్ పట్టణంలోని విమానాశ్రయంలో 181 మందిని తీసుకెళ్తున్న జెజు ఎయిర్ ప్యాసింజర్ విమానం నుండి ప్రజలను లాగడానికి రక్షకులు పరుగెత్తారని నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. రవాణా మంత్రిత్వ శాఖ విమానాన్ని 15 ఏళ్ల బోయింగ్ 737-800 జెట్‌గా గుర్తించింది మరియు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:03 గంటలకు ప్రమాదం జరిగిందని చెప్పారు. విమానంలో చిక్కుకున్న వారిని భద్రత సిబ్బంది ఇద్దరు ప్రయాణికులను బయటకు తీసినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది. విమానం ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టి ఉండవచ్చని.. అందుకే ల్యాండిగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.