PM Kisan : పీఎం కిసాన్ అర్హులు వీరే.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారో లేరో చెక్ చేసుకోండి
ప్రధానాంశాలు:
PM Kisan : పీఎం కిసాన్ అర్హులు వీరే.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారో లేరో చెక్ చేసుకోండి
PM Kisan : దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ నిధులు జూన్ 30న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాలతో ఆలస్యమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జూలై 18న ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటన నేపథ్యంలో ముందే నిధులు జారీ అయ్యే అవకాశముందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

PM Kisan : పీఎం కిసాన్ అర్హులు వీరే.. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారో లేరో చెక్ చేసుకోండి
PM Kisan : త్వరలోనే పీఎం కిసాన్ 20 వ విడుత నిధులు విడుదల
ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది మూడు విడతలుగా – ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున DBT (Direct Benefit Transfer) ద్వారా జమ అవుతుంది. ఈ పథకాన్ని పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి కాగా, వారి భూమి రెండు ఎకరాలకు మించకుండా ఉండాలి. అలాగే భూమి వివరాలు ఆన్లైన్‌లో నమోదు అయి ఉండాలి. బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఈ అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి వారే ఈ పథకానికి అర్హులవుతారు.
ఈ పథకానికి సంబంధించి మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి. అక్కడ “Beneficiary Status” అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా స్టేటస్ చెక్ చేయొచ్చు. అలాగే “Beneficiary List” విభాగంలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. పేరు లిస్టులో ఉంటేనే రూ.2,000 నిధులు ఖాతాలో జమవుతాయి. ఏవైనా సమస్యలు ఉన్నా, సంబంధిత గ్రామ వాలంటీర్ లేదా వ్యవసాయ అధికారిని సంప్రదించడం ఉత్తమం. e-KYC పూర్తి చేయడం మరవవద్దు – ఇది తప్పనిసరి ప్రక్రియ.