PM Kisan : గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Kisan : గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..?

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు..?

  •  PM Kisan : గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..?

PM Kisan  : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి పథకం Pradhan Mantri Kisan Samman Nidhi కింద 20వ విడత నిధులు నేడు (జూలై 18) రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో ఉన్న సందర్భంగా, ఈ నిధుల విడుదలపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ.6,000 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది.

PM Kisan గుడ్‌న్యూస్‌ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ

PM Kisan : గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..?

PM Kisan  : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతుల ఎదురుచూపులు ఈరోజుతో తెరపడనుందా..?

గత ఫిబ్రవరిలో రైతులకు 19వ విడత డబ్బులు అందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 20వ విడతగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది నేరుగా డీబీటి (Direct Benefit Transfer) ద్వారా జరుగుతుంది. ఈ పథకానికి అర్హులైన రైతులు తాము నమోదు చేసిన బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ నిధులు పొందగలుగుతారు. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.80 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పీఎం కిసాన్ పథకం PM Kisan  రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాక, వ్యవసాయ ఖర్చులను భరించడంలో కూడా సాయం చేస్తోంది. నిధులు జమ అయ్యాయని తెలుసుకోవాలంటే pmkisan.gov.in వెబ్‌సైట్‌లో లాభదారుల జాబితాలో తమ పేరు, ఖాతా వివరాలు చెక్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధానం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది