PM Modi : సిద్ధార్థ్ యాదవ్ రిసెప్షన్ కు హాజ‌రైన ప్రధాని మోడీ, ఎవరీ సిద్ధార్ధ్‌? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Modi : సిద్ధార్థ్ యాదవ్ రిసెప్షన్ కు హాజ‌రైన ప్రధాని మోడీ, ఎవరీ సిద్ధార్ధ్‌?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 March 2025,1:20 pm

ప్రధానాంశాలు:

  •  PM Modi : సిద్ధార్థ్ యాదవ్ రిసెప్షన్ కు హాజ‌రైన ప్రధాని మోడీ, ఎవరీ సిద్ధార్ధ్‌?

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ తన శైలితో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాగే మార్చి 1వ తేదీ సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కు ప్ర‌ధాని అకస్మాత్తుగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచినప్పుడు అలాంటిదే జరిగింది. ఈ రిసెప్షన్ మరెవరిదో కాదు బిజెపి అధికార ప్రతినిధి సిద్ధార్థ్ యాదవ్, ఆయ‌న భార్య గుల్షిన్ లది.

PM Modi సిద్ధార్థ్ యాదవ్ రిసెప్షన్ కు హాజ‌రైన ప్రధాని మోడీ ఎవరీ సిద్ధార్ధ్‌

PM Modi : సిద్ధార్థ్ యాదవ్ రిసెప్షన్ కు హాజ‌రైన ప్రధాని మోడీ, ఎవరీ సిద్ధార్ధ్‌?

PM Modi ఎవ‌రీ సిద్ధార్థ్ యాదవ్ ?

సిద్ధార్థ్ యాదవ్ ఢిల్లీ బిజెపి యూనిట్‌లో ప్రతినిధి. రాజకీయ వర్గాల్లో చురుకైన పేరు. అతని తండ్రి బిఎస్‌ఎఫ్‌లో అధికారి. 1999 కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యాడు. సిద్ధార్థ్ యాదవ్ సుప్రీంకోర్టు న్యాయవాది. అతని భార్య గుల్షిన్ కూడా వృత్తిరీత్యా న్యాయవాది. ఇద్దరూ ఇటీవలే వివాహం చేసుకున్నారు.

మార్చి 1న సిద్ధార్థ్, గుల్షిన్ ఢిల్లీలో రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎవరికీ తెలియదు. దాంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీని చూసి ఆశ్చర్యపోయారు. ప్రధాని మోదీ నూతన దంపతులను అభినంద‌న‌లు తెలుప‌డ‌మే కాకుండా, సరదా వ్యాఖ్య‌లు చేశారు. మీరిద్దరూ న్యాయవాదులు, ఇప్పుడు ఇంట్లో ప్రతిరోజూ వాదనలు జరుగుతాయి! అన్నారు. దాంతో సిద్ధార్థ్, గుల్షిన్ బిగ్గరగా నవ్వడంతో అక్కడ ఉన్న అతిథులు కూడా నవ్వారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది