Prakash Raj : ఒకరు సనాతనం మరొకరు సమానత్వం అంటూ పవన్, ప్రకాశ్ రాజ్ ఫైట్
ప్రధానాంశాలు:
prakash Raj : ఒకరు సనాతనం మరొకరు సమానత్వం అంటూ పవన్, ప్రకాశ్ రాజ్ ఫైట్
Prakash Raj : ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కడం మనం చూశాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ తయారీలో భాగంగా ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన.. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. సనాతన ధర్మంపై, హిందూ మతంపై, ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇక లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటి నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్న ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.
Prakash Raj డిష్యూం డిష్యూం..
అధికారంలో ఉన్నవారు ఆరోపణలు చేయకుండా.. తప్పు చేసిన వారిని శిక్షించాలని, దీనికి మతం రంగు పులుమకూడదని పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. “సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. ఆల్ ది బెస్ట్ #జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారని.. నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా చెన్నైలోని ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేసాడు ప్రకాశ్‌రాజ్.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనం అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. మాది సమానత్వం. దీనికి కట్టుబడి ఉన్నాను“ అని ప్రకాష్ రాజ్ అని అన్నారు. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరపున మాట్లాడుతాను అని చెప్పుకొచ్చారు. గతంలో సనాతన ధర్మంపై తన వైఖరి గురించి ప్రకాష్ రాజ్ గళం విప్పారు. దానిని రాజకీయ సాధనంగా ఉపయోగించే వారు నిజంగా హిందూ విలువలకు ప్రాతినిధ్యం వహించరని నొక్కి చెప్పారు. మరి ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకి కారణం ఏంటా అని అందరు ఆలోచనలు చేస్తున్నారు.