KTR VS Revanth Reddy : పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియదు.. నువ్వేం ముఖ్యమంత్రివి.. సిగ్గుతో తలదించుకుంటున్నా.. కేటీఆర్ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KTR VS Revanth Reddy : పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియదు.. నువ్వేం ముఖ్యమంత్రివి.. సిగ్గుతో తలదించుకుంటున్నా.. కేటీఆర్ ఫైర్

KTR VS Revanth Reddy : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వాళ్లు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని ఉద్దేశంలో మైక్ ఇచ్చాం. మైక్ ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం. మీరు వాళ్లకు ఇచ్చారు. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ.. నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించి ఉంటే ఖచ్చితంగా వాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ అక్కసు వెళ్లగక్కుతున్నారు. అక్కడేదో మేనేజ్ మెంట్ కోటాలో నేను కూర్చుందామని […]

 Authored By kranthi | The Telugu News | Updated on :17 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  610 జీవో మీద తెలంగాణ సమస్యల మీద ఆనాడు చర్చ జరిగిందన్న రేవంత్

  •  నువ్వేం ముఖ్యమంత్రివి అన్న కేటీఆర్

  •  అసెంబ్లీలో రచ్చ రచ్చ

KTR VS Revanth Reddy : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వాళ్లు ఏదైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని ఉద్దేశంలో మైక్ ఇచ్చాం. మైక్ ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం. మీరు వాళ్లకు ఇచ్చారు. దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగపడేది కానీ.. నేను మాట్లాడిన అంశాలలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని ప్రస్తావించి ఉంటే ఖచ్చితంగా వాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ అక్కసు వెళ్లగక్కుతున్నారు. అక్కడేదో మేనేజ్ మెంట్ కోటాలో నేను కూర్చుందామని అనుకుంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కూర్చొన్నాడు కాబట్టి నేను చూసి ఓర్వలేకపోతున్నా అనే కుళ్లు కనిపిస్తోంది తప్పితే ఇంకేం లేదు. గత ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నా కొన్ని వాస్తవాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. నీ ద్వారా వాళ్లు ఆ సమయంలో మరి గుర్తుందో లేదో.. ఇప్పుడు గుర్తు చేయాలని అనుకుంటున్నా. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్ లలో తిరుగుతూ.. పదో తరగతి పరీక్షలే నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఆనాడు ఉండేది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

18 జులై 1996, ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ 610 జీవో మీద తెలంగాణ సమస్యల మీద జరిగింది. అప్పుడు ఒక గొప్ప నాయకుడు.. చాలా గొప్ప నాయకులం అని చెప్పుకునే వాళ్లు ఏం మాట్లాడారో చెప్పదలుచుకున్నా అధ్యక్షా. ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి. సర్ ప్లస్ స్టాఫ్ ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునే వీలు ఉండాలి. కానీ.. ఆ విధానం లేదు. మనం విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక, పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరార్ధకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృథా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్ గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజల ప్రజా ప్రతినిధులతోనో, ఉద్యోగ సంఘాలతోనో సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి.. అని ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతోటి కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను, కోటాను నిర్ణయించి, నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ 18 జులై 1996 నాడు మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగంలోకి పాఠం ఇది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

KTR VS Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడిలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు

స్పీకర్ సార్.. నేను నిజంగానే సిగ్గు పడుతున్నా సార్. పంటల భీమాకు రైతు భీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గు పడుతున్నా. పంట బీమాకు, రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. వారు పర్సనల్ గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఏదో పీసీసీ అధ్యక్ష పదవిలో గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్స్ చేస్తున్నారు. ఆయన గౌరవమైన పదవిలో ఉన్నారు. నేను ఏమంటానంటే.. నేరెళ్లలో ఏదో జరిగింది. సాండ్ మాఫియా అంటున్నారు. 2004 నుంచి 2014 వరకు సాండ్ మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు. అంతే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలేదు. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్షా.. ఈ రాష్ట్రానికి ఇసుక మీద వచ్చిన ఆదాయం 5000 కోట్ల పైచిలుకు అధ్యక్షా. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు సాండ్ మాఫియా ఎవరిది కాంగ్రెస్ పార్టీదా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నిండినయా? ఎవరి జేబులు నిండాయి. నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు.. ఎక్కిచ్చారు అంటున్నారు. పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. 2018 కి ముందు చెప్పారు. తర్వాత చెప్పారు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీ అభ్యర్థికి మరొకసారి గెలిపించారు అని కేటీఆర్.. రేవంత్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది