Revanth Reddy : రైతు భరోసాపై నలుగురిలో అనేక అనుమానాలు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
ప్రధానాంశాలు:
Revanth Reddy : రైతు భరోసాపై నలుగురిలో అనేక అనుమానాలు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : రైతు భరోసా విషయంలో కొద్ది రోజులుగా అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతీ సంవత్సరం రైతులకు ఎకరానికి రూ.12,000 చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇందులో ఇన్ని ఎకరాలకు మాత్రమే అనే పరిమితి లేదు. వ్యవసాయం చెయ్యడానికి అనుకూలంగా ఉన్న, అలాగే సాగు చేస్తున్న ప్రతీ ఎకరానికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది రైతులకు, కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. ఐతే.. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
Revanth Reddy క్లారిటీ ఇచ్చారు..
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏటా రూ.12 వేలు సాయం అందించేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ జరగనుంది. ఇక ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఇక కేబినేట్‌లో పలు నిర్ణయాలు తీసుకోగా, వాటిలో పంచాయతీరాజ్‌లో 508 కారుణ్య నియామకాలు, కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు, పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ-2 వ్యయం రూ.1,784 కోట్లకు పెంపు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్‌లో 588 కారణ్య నియామకాలకు ఆమోదం, 56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో వీలినానికి గ్రీన్‌సిగ్నల్, టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బును.. రెండు విడతలుగా ఇవ్వబోతోంది. మొదటి విడతను జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) నుంచి రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది. అంటే రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున జమ చేస్తారు. అలాగే రైతు కూలీలకు రూ.6,000 జమచేస్తారు. ఇలా అందరు అర్హుల అకౌంట్లలో మనీ జమ అవ్వడానికి ఓ 10 రోజులు పట్టొచ్చు.పెద్దగా షరతులు లేవు కాబట్టి.. ప్రభుత్వానికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు భారీగా ఖర్చవుతుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.7,800 కోట్ల దాకా కేటాయించాల్సి ఉంటుంది. అలాగే.. ఆత్మీయ భరోసా కోసం రూ.12,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. అంటే దాదాపు రూ.20వేల కోట్లను జనవరి 25 లోగా ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద సవాలే.