Revanth Reddy VS KTR : హాట్ హాట్ గా నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు .. రేవంత్ రెడ్డి VS కేటీఆర్.. ఎవ్వరు తగ్గలేదు..!
ప్రధానాంశాలు:
Revanth Reddy VS KTR : హాట్ హాట్ గా నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ..
రేవంత్ రెడ్డి VS కేటీఆర్.. ఎవ్వరు తగ్గలేదు..!
Revanth Reddy VS KTR : నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ వేశారు. చీమలో పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేకే మహేందర్ రెడ్డి కి అన్యాయం చేశారన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవని కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎన్నారై లకు ప్రజాస్వామ్య విలువ తెలియదు అని అన్నారు. ఐదేళ్ల సమయం ఉందని జరిగిన విధ్వంసం బయట పెడతాను అని అన్నారు. కేసీఆర్ కు రాజకీయ జీవితం ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా ఆయనకు పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు…
వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా చేశారని తెలిపారు. గతం గురించి చర్చిద్దాం అంటే ఒకరోజు సమయం ఇవ్వండి అని లెక్కలు తీద్దామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలన పై ఎక్స్ రే తీస్తానని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని అన్నారు. అంతకుముందు కేటీఆర్ కామెంట్లపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక రేవంత్ రెడ్డి మాటలకు కేటీఆర్ రిప్లై ఇస్తూ ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా గౌరవంగా మాట్లాడతారు అనుకున్నా. కానీ కొన్ని ఊహించలేం. అది వారికి సాధ్యం కాదు ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని కల్వకుంట చంద్రశేఖర రావు అని ఏకవచనంతో మాట్లాడారు. తెలంగాణలో వ్యతిరేకించిన వాళ్ళని గారు అని మర్యాద ఇస్తున్నారు…
దీంతో వాళ్ళ సంస్కారం ఏంటో అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో భట్టి అన్న, శ్రీధర్ బాబు, దామోదర్ ప్రభాకర్, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్లంతా కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న రేవంత్ రెడ్డి చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అని మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. అలాగే ఎన్నారైలు నాన్ రిలైవబుల్ అన్నారు. వారే కదా ఎన్నారై ల టికెట్లు అమ్ముకున్నది అని రేవంత్ రెడ్డి మాటలకు కేటీఆర్ మాటకు మాట సమాధానం ఇచ్చారు…