Kodandaram : మినిస్టర్ గా కోదండరాం .. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మానసిక దాడి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodandaram : మినిస్టర్ గా కోదండరాం .. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మానసిక దాడి..!

Kodandaram : తెలంగాణ జన సమితి నేత కోదండరాంను మంత్రిని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎంపీగా చేసి తర్వాత క్యాబినెట్ లో తీసుకుంటామని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపారు. ఈ అంశంపై కోదండ రామ్ కు కూడా సంకేతాలు అందాయి. ఆయన కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు నైతికంగా ఇబ్బందికరమని అంటున్నారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాంకు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చినట్లు […]

 Authored By anusha | The Telugu News | Updated on :15 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kodandaram : మినిస్టర్ గా కోదండరాం .. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మానసిక దాడి..!

Kodandaram : తెలంగాణ జన సమితి నేత కోదండరాంను మంత్రిని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎంపీగా చేసి తర్వాత క్యాబినెట్ లో తీసుకుంటామని రేవంత్ రెడ్డి సంకేతాలు పంపారు. ఈ అంశంపై కోదండ రామ్ కు కూడా సంకేతాలు అందాయి. ఆయన కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు కోదండరాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు నైతికంగా ఇబ్బందికరమని అంటున్నారు. తెలంగాణ కోసం పోరాడిన కోదండరాంకు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చినట్లు అవుతుంది. కేసీఆర్ ఇంతకాలం పట్టించుకోలేదు అన్న అంశం మరోసారి హైలెట్ అవుతుంది. అయితే ఎన్నికలకు భారత జన సమితి పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. అప్పుడే రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడిన వారికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విధానం రూపకల్పనలో ఆరు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోదండరాం కోరారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రైవేట్ పరిశ్రమల్లో భూమిపుత్రులకు అవకాశం ఇవ్వాలని అన్నారు. వాస్తవ సాగుదారులందరికీ చిన్న, సన్న కౌలు రైతుల ఆదాయ భద్రత సాధించడంతోపాటు భూమి రక్షణ హక్కుల చర్యలకు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు వీటిని రేవంత్ రెడ్డి కోదండ రామ్ చేతుల మీదగానే నిర్వర్తించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తే తప్పకుండా చేరుతామని బీజేఎస్ చీఫ్ కోదండరాం కూడా చెబుతున్నారు.

కోదండరాంకు ముందు నుంచి రేవంత్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రి ని చేయాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి కోదండరామ్ కు ఇచ్చేలా కాంగ్రెస్ హై కమాండ్ తేల్చిందని చెబుతున్నారు. రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగిన ఆయనను మంత్రిని చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు. కానీ బీఆర్ఎస్ ఆయనను పట్టించుకోలేదు. ఇక కోదండరాం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై మొదటినుంచి అభిమానం చూపిస్తున్నారు. కానీ తర్వాత అయినా సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఎంపీగా చేస్తే బీఆర్ఎస్ పై చేయి సాధించినట్లు అవుతుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది