Kim Jong-un : కిమ్ మూర్ఖత్వానికి బలైన రష్యా దౌత్యవేత్తలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kim Jong-un : కిమ్ మూర్ఖత్వానికి బలైన రష్యా దౌత్యవేత్తలు

 Authored By brahma | The Telugu News | Updated on :2 March 2021,2:15 pm

Kim Jong-un : కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావటంతో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి నుండి కరోనా అంటే భయపడిపోతున్న కిమ్, తన దేశంలో కరోనా పేషంట్ కనిపిస్తే కాల్చిపడేయమని ఆదేశాలు ఇచ్చాడు. అదే విధంగా తమ దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరోనా కేసు నమోదు కాలేదని ప్రకటించుకున్నాడు.

అయితే ఇప్పటికి కూడా అక్కడ కరోనా ఆంక్షలు పెద్ద ఎత్తున్న కొనసాగుతున్నాయి. దీనితో ఇతర దేశాల నుండి వచ్చిన అనేక మంది తమ స్వదేశాలకు వెళ్లలేక, అక్కడే ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏడాది కాలంగా రష్యా దౌత్యవేత్తలు తమ దేశానికి వెళ్ళటానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. చివరికి ఒక ఆలోచన చేసి రైల్వే ట్రక్ మీద ఒక ట్రాక్ తయారుచేసి, సామాన్లతో సహా దాదాపు 32 గంటలు దానిని తోసుకుంటూ ప్రయాణం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

దీనికి సంబధించిన వీడియో రష్యా విదేశాంగ శాఖ తన టెలిగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేసింది. దీనితో అది వైరల్ అయ్యింది. అదే సమయంలో ఇన్నాళ్లు నార్త్ కొరియా మరియు రష్యా ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నా అవన్నీ అపోహలే అని రుజువయ్యాయి. కరోనా కు భయపడి గత ఏడాది నుండి తమ సరిహద్దులు అన్ని మూసివేసింది నార్త్ కొరియా, దీనితో రష్యా దౌత్యవేత్తలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

russian diplomats strongfor kim stupidity

russian diplomats strongfor kim stupidity

ఇంకా ఎన్నాళ్ళు ఈ ఆంక్షలు ఉంటాయనేది అర్ధం కానీ పరిస్థితి ఉండటంతో రష్యా దౌత్యవేత్తలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సమన్లు, పిల్లలను ట్రాలీ మీద ఉంచి వాళ్ళని నెట్టుకొని తమ దేశం చేరుకున్నారు. వారు వస్తున్నారు అనే సమాచారం ఉండటంతో సరిహద్దుల దగ్గర వాహనాలను సిద్ధం చేశారు, దౌత్యవేత్తలు రావటంతో వారికీ కరోనా పరీక్షలు చేసి రష్యాలోకి అనుమతి ఇచ్చారు, వచ్చే రెండు వారాలు బయట తిరగావద్దు అంటూ వాళ్లకు చెప్పటం జరిగింది. దీనితో మరో రెండు గంటలు ప్రయాణించి తమ సొంత ఇళ్లకు చేరుకున్నారు.

దాదాపు ఏడాది నుండి అనేక ఇబ్బందులు పడిన వారు ఎట్టకేలకు తమ స్వస్థలాలకు చేరుకోవటంతో ఆనందంతో కేకలు వేశారు. వీడియో చూసినంత ఈజీగా మాత్రం వారు రష్యా చేరుకోలేదు. నార్త్ కొరియా నుండి రష్యా వచ్చే మార్గం చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి ఎన్నో అవరోధాలను దాటుకొని ఆ అధికారులు రష్యా చేరుకున్నారు. అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ విషయంలో వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉన్నకాని అవేమి పట్టించుకోకుండా తన ధోరణి ఏమిటో ప్రపంచానికి మరోసారి రుజువు చేశాడు .

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది