Vladimir Putin : ఎవ్వరి మాటా వినడు.. సీతయ్యకు తాత ఈయన.. నియంతకు కేరాఫ్ అడ్రస్ పుతిన్
Vladimir Putin : నియంత అంటే నియంతే. అవును.. అప్పట్లో నియంత అంటే ఎలా ఉంటాడో హిట్లర్ ను చూసి తెలుసుకున్నాం. మళ్లీ ఇప్పుడు నియంత అంటే పుతిన్ లా ఉంటాడని తెలుసుకున్నాం. పుతిన్ ఎవరో తెలుసు కదా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం ఉక్రెయన్ లో పరిస్థితి ఎలా ఉందో ప్రపంచం మొత్తం తెలుసు.
గత సంవత్సరం ఇలాంటి పరిస్థితే ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పడింది. చివరకు ఆఫ్ఘాన్ తాలిబాన్ల వశం అయింది. ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. త్వరలోనే ఉక్రెయిన్ ను వశపరుచుకుపోతోంది.
Vladimir Putin : రష్యా ప్రజలు ఏమనుకుంటున్నారు?
రష్యా ప్రజల్లోనూ తాము నియంత పాలనలో ఉన్నామని ఇప్పుడు తెలిసొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే మనకేంటి అని అనుకోవచ్చు. మనం ఎక్కడో భారత్ లో ఉన్నాం కదా. మనకు ఏంటి నష్టం అనుకోవచ్చు కానీ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడం వల్ల.. ప్రపంచం మొత్తానికి నష్టమే. ప్రపంచం మొత్తం మరోసారి ఆర్థికంగా ఇబ్బంది పడబోతోంది. ఈ ప్రభావం అనేక దేశాల మీద పడనుంది.
అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుకునేది ఒక్కటే. అమెరికాతో ప్రతి విషయంలో రష్యా పోటీ పడాలి. అమెరికాలా అగ్రరాజ్యంగా వెలుగొందాలి. అందుకే ఆయన ఉక్రెయిన్ తో యుద్ధానికి సిద్ధమయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. నిజానికి యుద్ధాలు అనేవి ఒకప్పుడు జరిగాయి కానీ.. ఈ జనరేషన్ లో యుద్ధాలు అంటే కష్టమే. కానీ.. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం పుతిన్ చేస్తున్న యుద్ధం ఇది.
కేవలం నాటోలో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ కోరిందని.. పుతిన్.. ఉక్రెయిన్ పై కక్ష్యగట్టాడా అర్థం కావడం లేదు. అయితే.. యుద్ధంలో రష్యా.. ఉక్రెయిన్ ను గెలిస్తే గెలవొచ్చు గాక కానీ.. అంతిమంగా నష్టపోయేది మాత్రం రష్యానే అని విశ్లేషకులు భావిస్తున్నారు.