Kodi Pandalu : సంక్రాంతి Pongal పండగ వచ్చిందంటే చాలు మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా కోడి పందేలని ఎంజాయ్ చేసేందుకు పట్టణాల నుండి వస్తుంటారు. అయితే కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అయితే కోడి పందేల Kodi Pandalu కహానీ ఏంటో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.కొందరి వాదన ప్రకారం కోడిపందాలు రాజులు, జమీందారుల కాలం నాటి వినోద కార్యక్రమంగా సాగేది.
అప్పట్లో యుద్ధాల స్ఫూర్తితో ఈ పందాలు సరదాగా ప్రారంభించారు. శౌర్యం, తెగువకు ప్రతీకగా వీటిని నిర్వహించేవారు. కాలక్రమేణా ఇది గ్రామాల్లోకి చేరి సంక్రాంతి వేడుకల్లో భాగంగా మారిపోయిందని చెబుతారు. మరికొందరి నమ్మకం మేరకు ఇది దేవతల ఆరాధనలో భాగం. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలకు కోళ్లను బలిచ్చే ఆచారం ఉండేది. ఆ తర్వాత ఆ ఆచారం Tradition కాస్తా కోడిపందాలుగా రూపాంతరం చెందిందని కొంతమంది అంటారు. ఇంకా చెప్పాలంటే, ఇది పంటలు చేతికి వచ్చిన సంతోషంలో రైతులు జరుపుకునే వేడుకల్లో ఒక భాగంగా కూడా చూడొచ్చు. పౌరుషానికి ప్రతీక కూడా కోడిపందాలు నిలుస్తాయి. సినిమాల్లో చూపించిన దానికంటే కోడిపందాలు పౌరుషాన్ని రగుల్చుతాయి. అందుకే కోడిపందాలకు అంత క్రేజ్.
మన రాష్ట్రంలో గోదావరి, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీగా కోళ్ల పందాలు జరుగుతాయి. అయితే ఇది జూదంలా మారాయి అనడం అతిశయోక్తి కాదు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చి.. జూదంలా మారాయి. అందుకే ఏటా ప్రభుత్వాలు కోడిపందాల విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేస్తాయి కానీ. కోడిపందాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతాయి. చట్టాలు ఎన్ని ఉన్నా, సంక్రాంతి సమయంలో కోడిపందాలు మాత్రం ఆగడం లేదు. ఇది తరతరాలుగా వస్తున్న సంస్కృతి అని కొందరు సమర్థిస్తుంటే, మూగజీవులను హింసించడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, కోడిపందాలు మాత్రం సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన కలర్‌ఫుల్ వైబ్‌ని తీసుకొస్తాయి.
Pithapuram Varma : ఒకప్పుడు పిఠాపురం పేరు అందరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ Pawan Kalyan…
Padi Kaushik Vs Sanjay : కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో గందరగోళం నెలకొంది. బిఆర్ఎస్ హుజురాబాద్…
Nallari kiran kumar reddy : ఈ మధ్య కాలంలో వైఎస్ ఫ్యామిలీ ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే…
Viral Video తెలంగాణలో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనావాసాలలోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఒక గుంటనక్క…
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు…
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా…
Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే…
Jasmine : మల్లెపూలు అందరూ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మల్లెపూల Jasmine యొక్క సువాసన మరియు మల్లెపువ్వు తెలుపు రంగును…
This website uses cookies.