Makar Sankranti : మకర సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ఏమిటి…? ఈ పండుగను మూడు రోజులు ఎలా చేసుకుంటారు…?
ప్రధానాంశాలు:
Makar Sankranti : మకర సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత ఏమిటి...? ఈ పండుగను మూడు రోజులు ఎలా చేసుకుంటారు...?
Makar Sankranti : మకర సంక్రాంతి పండుగ : Makar Sankranti సూర్య భగవానుడు నెలకు ఒక్కసారి ఒక్కొక్క రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. 12 రాశుల్లో ఒక్కొక్క రాశి మారిన ప్రతిసారి సంక్రమణం అంటారు. కానీ రాశి ధనస్సు రాశి నుంచే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఏ పండుగ అయిన ఒక్క రోజు చేసుకుంటారు. కానీ ఈ ఒక్క మకర సంక్రాంతి పండుగ మాత్రం మూడు రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటి ఈ పండుగను మూడు రోజులు ఎలా చేసుకుంటారు. దీన్ని పెద్ద పండుగ ఎలా జరుపుకుంటారు పూర్తి వివరాలు తెలుసుకుందాం… సూర్య భగవానుడు దక్షిణం దిక్కు వైపున ప్రయాణించి తరువాత తన దిశను మార్చుకుని పుష్య మాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీనిని ఉత్తరాయన పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడు గమనించే దిశ మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తి మార్పులు వస్తాయి. సంక్రాంతి సౌరవమానం ప్రకారం చేసుకుంటారు. కాబట్టి పండుగ తేదీలో మార్పులు ఉండడం చాలా అరుదు.
Makar Sankranti అసలు సంక్రాంతి పండగే పెద్ద పండుగ ఎందుకు అయ్యింది
సంక్రాంతి పండుగ వచ్చే సమయానికి పొలాల నుంచి కొత్త పంట ధాన్యం ఇంటికి చేరుతుంది. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను చూసి చాలా ఆనందంతో చిరునవ్వులతో చిందేస్తారు. ఇంటింటికి చేరిన ధాన్యం అన్నం వండుకొని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం అంత తొందరగా అరగదు. కావున ఆ బియ్యానికి బెల్లం కలిపి పరమాన్నం వండుతారు. అలాగే అప్పలు,అరిసెలు, చెక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేయటం వలన ఇంట్లో పిండి వంటలు చేసుకున్న అనుభూతి కూడా ఉంటుంది. మనకి జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉన్నా కూడా పోతాయి. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు. కావున అక్కడ ఇలా చేయడాన్ని పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికి అందించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అంతేకాదు ప్రకృతిని పూజించటంతో పాటు పశువులను కూడా పూజిస్తారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇంటింటా పిండి వంటలతో గుమలాడుతూ ఉంటుంది. అలాగే వాకిట్లో ముగ్గులు కళకళలాడుతూ ఉంటాయి. ఆ ముగ్గులో గొబ్బెములు పేడతో చేసి పెట్టడం వల్ల మనం ఇంటిలోకి ఎటువంటి బ్యాక్టీరియాలు ప్రవేశించవు. రైతులు పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి ఒక్క కూరగాయని ఆ ముగ్గులోని గొబ్బెమ్మ దగ్గర పెట్టి పూజిస్తారు. దీనివల్ల పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని ప్రజల యొక్క ప్రగాడ విశ్వాసం.
సంక్రాంతి పండుగ నాడు నువ్వుల ప్రత్యేకత గురించి
మకర సంక్రాంతి పండుగ రోజు చేసే పిండి వంటలలో నువ్వులకు ప్రత్యేక స్థానం కేటాయిస్తారు. చాలా రాష్ట్రాలలో నువ్వులతో చేసిన వంటలు ఈ పండగ నాడు కనపడతాయి. కొందరు నువ్వులను శని దేవునికి రూపంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు. నువ్వులు వాడడం వెనక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి. చలికాలంలో సంక్రాంతి పండుగ వస్తుంది కావున, ఈ సమయంలో మన శరీరం చాలా చల్లగా ఉంటుంది. చలిని నుండి మనల్ని కాపాడుకొనుటకు నువ్వుల వంటకాలను చేసి, దాన్ని తినడం వల్ల మన శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా చలికాలంలో వచ్చే అంటువ్యాధులు నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ సంక్రాంతి టైంలో కాకుండా మామూలు టైం లో నువ్వులు ఎక్కువగా వాడితే వేడి చేస్తుందని వీటిని ఎక్కువగా పట్టించుకోరు. కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇటువంటి సమయంలో నువ్వులనే ఎక్కువగా తింటే వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లు అవుతుంది.
Makar Sankranti సంక్రాంతి ముగ్గులు
ఈ మకర సంక్రాంతి పండుగనాడు పిండి వంటలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. ముగ్గుల కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ ముగ్గులను మూడు రోజులపాటు, భోగి సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు జరుపుకుంటారు. ఈ మూడు రోజులు ఇంటి వాకిట్లలలో ముగ్గులు కలకలలాడుతూ ఉంటాయి. రంగురంగుల రంగవల్లిలో మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రతి ఇంటి ముంగిళ్ళలో అందమైన ముగ్గులు దర్శనమిస్తాయి. అంతేకాదు పిల్లలు, పెద్దలు, గాలిపటాలను, గొబ్బిళ్ళను ఇలా సంక్రాంతికి ఎన్నో పాటిస్తారు. హిందువుల ప్రతి ఇంట సంక్రాంతి ముగ్గు దర్శనమిస్తుంది. వాకిట్లలో అందమైన ముగ్గు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. నీ అందమైన వాకిళ్లు కలకలలాడుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసమై ఉంటుంది. అలాగే ఈ మకర సంక్రాంతి నాడు హరిదాసులు, బుడబుక్కల వారు, గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తూ తిరుగుతూ ఉంటారు. వీరికి సంక్రాంతి పండుగ నాడు ఏదైనా దానం ఇస్తే మనకి ఏమైనా దోషాలు ఉంటే అయిపోయి అంతా,శుభమే జరుగుతుంది. అని ప్రజల యొక్క విశ్వాసం. ఇలా దానం చేయటం వల్ల భగవంతుడు ఆశీస్సులు మనకు ఉంటాయి. సంక్రాంతి పండుగ వస్తే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇతర పోటీలు జరుగుతాయి.
Makar Sankranti 2025 సంక్రాంతి జరుపుకునే తేదీలు
-భోగి పండుగ- జనవరి 13 సోమవారం.
-సంక్రాంతి- జనవరి14 మంగళవారం.
– కనుమ జనవరి 16 బుధవారం.
– ముక్కనుమ- జనవరి 17 గురువారం.