Shahid Afridi : రక్తం మరిగే వ్యాఖ్యలు చేసిన షాహిద్ ఆఫ్రిది.. భారతీయులు ఆగ్రహం..!
ప్రధానాంశాలు:
Shahid Afridi : రక్తం మరిగే వ్యాఖ్యలు చేసిన షాహిద్ ఆఫ్రిది.. భారతీయులు ఆగ్రహం..!
Shahid Afridi : పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది అమాయక భారతీయుల మరణాన్ని ఇంకా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీ వారిని అస్సలు వదిలిపెట్టడని గర్వంగా భారతీయులు చెప్పుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Shahid Afridi : రక్తం మరిగే వ్యాఖ్యలు చేసిన షాహిద్ ఆఫ్రిది.. భారతీయులు ఆగ్రహం..!
Shahid Afridi ద్వేష పూరిత కామెంట్స్..
ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ పాకిస్థాన్‌ను నిందిస్తోందని అఫ్రిది ఆరోపించాడు. పాకిస్థాన్‌పై చేసిన ఆరోపణలకు భారత్ ఆధారాలు అందించాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. రెండు దేశాలు మాట్లాడుకోవాలని అఫ్రిది అన్నాడు. అఫ్రిది ప్రకారం.. మన సమస్యలకు చర్చలే ఏకైక పరిష్కారమని.. పోరాటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నాడు. నిందలు వేసే బదులు చర్చల్లో పాల్గొని సమస్యలు పరిష్కరించాలి. క్రికెట్ ను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని ఆఫ్రిది అన్నాడు.
పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌తో జలాల పంపక ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. భారత్ కూడా పాకిస్థాన్‌తో సరిహద్దును మూసివేసింది. దీంతో పాటు పాకిస్థాన్ దౌత్యవేత్తల వీసాలను కూడా భారత్ రద్దు చేసింది. పాకిస్థాన్ కూడా భారతీయుల వీసాలను రద్దు చేసింది. అదే సమయంలో సింధు నది నీటిని భారత్ ఆపేస్తే దానిని యుద్ధచర్యగా పరిగణిస్తామని పాక్ హెచ్చరిక జారీ చేసింది.