Categories: Newspolitics

Tirupati Laddu : ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..!

Advertisement
Advertisement

Tirupati Laddu  : తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారం ఎంత వివాదాస్పదంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలతో తిరుపతి లడ్డూ వివాదాస్పదమైంది. ఆధారాల్లేకుండా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుబట్టిన న్యాయస్థానం ఇవాళ తదుపరి విచారణ చేపట్టింది. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది.

Advertisement

Tirupati Laddu ప్ర‌త్యేక సిట్

తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. అయితే సిట్​పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారురు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు.

Advertisement

Tirupati Laddu : ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, విక్రమ్‌సంపత్‌ అనే భక్తుడు, సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ సురేష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్‌) కొనసాగించాలా? లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది.

Advertisement

Recent Posts

Nagarjuna : కుటుంబ కోసం దానికి రెడీ అంటున్న నాగార్జున.. వివాదం ముదురిపోతుందే..!

అక్కినేని ఫ్యామిలీ పరువు మొత్తాన్ని బజారుకి ఈడ్చేంత పనిచేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. కే టీ ఆర్ ను…

2 hours ago

Prakash Raj : స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి.. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం.. పవన్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్..!

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న…

3 hours ago

Congress Govt : తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం .. 300 రోజుల్లో రూ.72,500 కోట్లు అప్పు

Congress Govt : కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చినప్పటి…

4 hours ago

NABARD : నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ : 108 గ్రూప్ సి పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

NABARD : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ క్రింద…

5 hours ago

Viral Video : క‌లిచి వేసే సంఘ‌ట‌న‌.. బ‌తుకు దెరువు కోసం బండిమీద వెళ్లి, దానిపైనే మృత్యువు..!

Viral Video : ఈ ప్ర‌పంచంలో మ‌నిషి త‌న జీవితాన్ని సాఫీగా న‌డిపించుకోవ‌డం చాలా క‌ష్టం అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి…

6 hours ago

Chandrababu : చంద్ర‌బాబు త్వ‌ర‌గా మేలుకో.. లేదంటే పెను ప్ర‌మాదం ముంచుకొస్తుంది..!

Chandrababu : ప్రజల వద్దకే పాలన.. ఎంతోమంది రాజకీయ పార్టీల నాయకుల నోటి నుంచి వినే మాట‌. కొందరు ఆ…

7 hours ago

Konda Surekha : కొండా సురేఖ నోటి దూల‌పై హైకమండ్ సీరియ‌స్.. రాజీనామా త‌ప్ప‌దా?

Konda Surekha : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్‌ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖ‌పై…

8 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో సీక్రెట్ ఎఫైర్స్ న‌డుస్తున్నాయా… పెద్ద బాంబ్ పేల్చిన సోనియా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. రోజు రోజుకి ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఇప్పుడు…

9 hours ago

This website uses cookies.