Tirupati Laddu : ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirupati Laddu : ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 October 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Tirupati Laddu : ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Tirupati Laddu  : తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారం ఎంత వివాదాస్పదంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలతో తిరుపతి లడ్డూ వివాదాస్పదమైంది. ఆధారాల్లేకుండా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుబట్టిన న్యాయస్థానం ఇవాళ తదుపరి విచారణ చేపట్టింది. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది.

Tirupati Laddu ప్ర‌త్యేక సిట్

తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. అయితే సిట్​పై సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే దర్యాప్తుపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారురు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణల్లో నిజమైతే అలా జరగడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని వివరించారు.

Tirupati Laddu ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Tirupati Laddu : ల‌డ్డూ వ్య‌వ‌హారం విష‌యంలో ప్ర‌త్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, విక్రమ్‌సంపత్‌ అనే భక్తుడు, సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ సురేష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్‌) కొనసాగించాలా? లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది