TDP Janasena : కేంద్రం పై టీడీపీ – జనసేన ఒత్తిడి.. చంద్రబాబు – పవన్ ప్లాన్ అదేనా..?

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP Janasena : కేంద్రం పై టీడీపీ - జనసేన ఒత్తిడి.. చంద్రబాబు - పవన్ ప్లాన్ అదేనా..?

TDP Janasena : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 175 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండగా, విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపు అవకాశం ఉంది. తెలంగాణాకు 119 సీట్లు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 50 సీట్లు పెంచే వీలుందని అప్పట్లోనే నిర్ణయం తీసినప్పటికీ, ఇప్పటివరకు అది అమలుకాకపోవడం గమనార్హం. గతంలో టీడీపీ పాలనలో సీట్ల పెంపుపై ప్రయత్నాలు చేసినా, కేంద్రంలోని ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడంతో ఆ ప్రస్తావన నిలిచిపోయింది. తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అంశంపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో, 2024 వరకు మూడు ఎన్నికలు జరగినా సీట్ల సంఖ్య యథాతథంగా ఉంది.

TDP Janasena : కేంద్రం పై టీడీపీ - జనసేన ఒత్తిడి.. చంద్రబాబు - పవన్ ప్లాన్ అదేనా..?

TDP Janasena : కేంద్రం పై టీడీపీ – జనసేన ఒత్తిడి.. చంద్రబాబు – పవన్ ప్లాన్ అదేనా..?

TDP Janasena : ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయా..?

ప్రస్తుతం తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ – జనసేన కూటమి ఈసారి సీట్ల పెంపుపై గట్టి ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు పార్టీల్లోనూ అధిక సంఖ్యలో నాయకులు ఉన్న నేపథ్యంలో అందరికి పదవులు కేటాయించాలంటే సీట్ల పెంపు అవసరమవుతుంది. కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ, తమ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి 225 సీట్లు వరకూ పెంచే అవకాశం ఉన్నా, టీడీపీ ఆశయమైతే అదనంగా మరో 25 సీట్లు కూడా పెంచుకుని 250 సీట్లు చేయాలన్నదే.

ఇక జనాభా పెరుగుదల నేపథ్యంలో ప్రతీ రెండు లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ సీటు లెక్కన చూస్తే 250 సీట్లు రావచ్చన్న వాదనతో టీడీపీ వర్గాలు కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రానికి కూడా బలమైన మిత్రులుగా ఉన్న టీడీపీ – జనసేన కూటమి బలపడితే, జమిలీ ఎన్నికల సమయానికి ఇది బీజేపీకీ ఉపయోగపడొచ్చన్నది కేంద్ర పెద్దల ఆలోచన. ఈ క్రమంలో 2026 నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు ఖాయమనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో కేంద్రం చూడాలి.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి