TDP : బాబుకు పెద్ద తలనొప్పిగా మారిన ఆ టీడీపీ ఎమ్మెల్యే తీరు..!
ప్రధానాంశాలు:
వినుకొండ రాజకీయాల్లో బ్రహ్మనాయుడు కేసుల పరంపర
TDP : బాబుకు పెద్ద తలనొప్పిగా మారిన ఆ టీడీపీ ఎమ్మెల్యే తీరు..!
TDP : వైసీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలోనే రాజకీయంగా చురుగ్గా ఉంటున్నారు. కానీ ఆయన గత పాలనలో చేసిన చర్యలు ఇప్పుడు టీడీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో టీడీపీ నేతలపై కేసులు పెట్టించి వేధించారని, తాము ఎదుర్కొన్న ఇబ్బందులకు బ్రహ్మనాయుడే కారణమని వారు అంటున్నారు. అతనిపై కేసులు పెట్టించడమే కాకుండా, సొంత పార్టీ నేతలపైనా అక్రమ చర్యలు తీసుకున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.

TDP : బాబుకు పెద్ద తలనొప్పిగా మారిన ఆ టీడీపీ ఎమ్మెల్యే తీరు..!
TDP : బ్రహ్మనాయుడు కాదు ఎవరి మాట వినని సీతయ్య
ప్రస్తుతం వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న జీవి ఆంజనేయులు ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. అభివృద్ధి, సంక్షేమం కోసం తన సొంత నిధులు కూడా ఖర్చు చేయడంలో వెనుకాడరు. కానీ, బ్రహ్మనాయుడి గత వైఖరిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. కేసుల బాధలతో భాదితమైన వారు ఇప్పుడు ఆత్మరక్షణ కోణంలో బ్రహ్మనాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వినుకొండ మండలంలో దాదాపు 30 మంది కార్యకర్తలు, పది మంది నేతలు బ్రహ్మనాయుడి చర్యలపై న్యాయం జరగాలన్న డిమాండ్ చేస్తున్నారు. జీవి రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదని చెప్పినా, బాధితుల కోపాన్ని తగ్గించటం తేలికకాకపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తలకు న్యాయం జరిగేలా చేయాలన్నదే ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో జీవి ఆంజనేయులు సమస్యను ఎలా పరిష్కరిస్తారో, తన మృదుస్వరంతో ఎలా శాంతిపరిచే ప్రయత్నం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.