KTR : ఈ ఫలితాలు మాకు గుణపాఠం.. కేటీఆర్ ట్వీట్..!
KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ 39 స్థానాల్లో గెలిచింది. మరో 26 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో గెలిచింది. 24 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. బీఆర్ఎస్ ఓటమి కూడా ఖాయం అయిపోయింది.
ఈనేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. రెండు సార్లు బీఆర్ఎస్ ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కానీ.. బీఆర్ఎస్ ఓటమి నిరాశపరిచిందన్నారు. ఈరోజు ఫలితాలపై బాధ లేదు కానీ..
ఫలితాలు కాస్త నిరాశపరిచాయి. మేము అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. ఈ ఫలితాలు మాకు ఒక గుణపాఠంగా భావించి తిరిగి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ గెలిచినందుకు అభినందనలు. గుడ్ లక్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
