Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రైల్వే బోర్డు నుండి లభించిన సమాచారం ప్రకారం, జూలై 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నాన్-ఏసీ)లో ప్రయాణించేవారికి కిలోమీటరుకు ఒక పైసా పెరగనుండగా, ఏసీ తరగతిలో రెండు పైసాలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 20 వరకు అదనపు భారం పడనుంది.
Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
అలాగే సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 500 కిలోమీటర్ల వరకు ఛార్జీలు పెరగవు. కానీ 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తే అరపైసా చొప్పున అదనంగా చెల్లించాలి. ఉదాహరణకు, 1000 కి.మీ ప్రయాణానికి రూ. 2.50 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్ (లోకల్) రైళ్లలో ప్రయాణించే వారిపై ఈ ఛార్జీల పెంపు ప్రభావం ఉండదు. ఇది చిన్న పెరుగుదలగా కనిపించినా, తరచూ ప్రయాణించే వారిపై దీని ప్రభావం ఉండే అవకాశముంది.
ఇక తత్కాల్ టికెట్లకు సంబంధించిన కొత్త నిబంధనలు కూడా రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియజేసింది. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేవారికి ఇది అమలులో ఉంటుంది. అలాగే జూలై 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్యల వల్ల టికెట్లు న్యాయంగా అందించబడతాయని, మధ్యవర్తుల మోసాలను నివారించవచ్చని రైల్వే శాఖ చెబుతోంది.
coolie movie Review : భారీ అంచనాల మధ్య రజనీకాంత్ , లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం…
War 2 Movie Review : ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ…
Best Fish : చాలామంది చెబుతూనే ఉంటారు చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినడానికి…
Vastu Tips : చాలామందికి కూడా ఒక గృహం ని నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. నెరవేరినప్పుడు ఎంతో ఆనందంతో…
Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు…
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…
This website uses cookies.