Home » News » Team India Red Ball Form Is In Serious Question
News

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 25, 2025, 6:40 pm
Advertisement

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. గత 9 టెస్టుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే దక్కడం భారత్‌ టెస్ట్ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఇదే టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు రెండుసార్లు చేరడం గమనార్హం. ఇదే క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుదని. టెస్టుల్లో రాణించలేకపోవడానికి ప్రధాన కారణాలు ఫీల్డింగ్ లోపాలు, సరైన సెలక్షన్ లేకపోవడం, అలాగే లోతైన ప్రణాళికల లోపమేనా అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India  టీం ఇండియా కేవలం వన్డే , T20 లకే పరిమితమా..?

ఫీల్డింగ్ పరంగా భారత జట్టు గత కొన్ని మ్యాచ్‌ల్లో కీలక క్యాచ్‌లు వదలడం, మైదానంలో షార్ప్ మువ్‌మెంట్ లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా స్లిప్స్‌లో స్టాండర్డ్ తగ్గడం, రనౌట్ అవకాశాలను వదిలేయడం మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపాయి. ఇక ప్లేయర్ సెలెక్షన్ విషయంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం, అనుభవం ఉన్నవారికి రెగ్యులర్ అవకాశాలు ఇవ్వకపోవడం జట్టులో స్థిరత్వాన్ని దెబ్బతీసింది.

Advertisement

అయితే ఇది కారణాలని కూడా చెప్పలేం. టెస్టుల విషయంలో చాల సమస్యలు ఉన్నాయని చెప్పొచ్చు. భారత క్రికెట్ టెస్ట్ గేమ్‌కు సరైన దృష్టి ఇవ్వకపోవడం, ఐపీఎల్ వంటి లీగ్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధానం వల్ల రెడ్ బాల్ క్రికెట్ పట్ల ఆటగాళ్లలో మానసికత, ఫోకస్ తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. టాలెంట్ ఉన్నా గట్టి ప్రణాళిక లేకుండా పోతే గెలుపు సాధ్యపడదు. అందుకే టెస్ట్ క్రికెట్‌పై సమగ్ర పరిశీలనతో పాటు, స్ట్రాటజీకి, సెలెక్షన్‌కు సజావుగా పని చేసే వ్యవస్థ కావాలన్నది అభిమానుల అభిప్రాయం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి