Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?
ప్రధానాంశాలు:
మహిళలకు మోడీ రాఖీ పండగకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా..?
Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ - వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో కూడా మోదీ ప్రభుత్వం రాఖీ పండుగకు మహిళలకు ప్రత్యేక నిర్ణయాలు ప్రకటించింది. ఇప్పుడు కూడా వంట గ్యాస్ ధర తగ్గింపు దిశగా ఈరోజు కేంద్రం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో గృహ వినియోగదారులపై పడుతున్న ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది.

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?
Rakhi Gift మహిళలకు మోడీ రాఖీ గిఫ్ట్ ఇదే..!!
ఈరోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అమెరికా సుంకాలు, ఉపరాష్ట్రపతి ఎన్నిక, మరియు ఈసీపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు వంటి రాజకీయ అంశాలపై చర్చ జరగనుంది. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయంగానూ మోదీ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలోనే రాఖీ పండుగ సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపుపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గతంలో కూడా రాఖీ కానుకగా మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ పై రూ.200 రాయితీ ప్రకటించింది. అది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు వర్తించింది. ప్రస్తుతం కూడా కేంద్రం ఎల్‌పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు ఈ రాయితీని మరింత పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రాయితీ ఎంత మేరకు పెంచుతారనే దానిపై తుది నిర్ణయం వెలువడనుంది. ఈ ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.