Today Telugu Breaking News : పొలాన్ని కౌలుకి ఇచ్చిన యజమానులకు రైతుబంధు ఇవ్వం.. నిజామాబాద్, బోధన్ లో పోస్టర్ల కలకలం.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

Advertisement
Advertisement

Today Telugu Breaking News : మీ భూమి ఎవరికైనా కౌలుకు ఇస్తే.. అప్పుడు ఆ భూమి యజమానికి రైతుబంధు ఇవ్వం. ఆ భూమిని కౌలు చేసే రైతులకే రైతు బంధు(Rythu Bandhu) ఇస్తాం. అసలు భూయజమాని కౌలుకు ఇస్తే రైతు బంధు ఇవ్వం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్(Charan Koushik Yadav) స్పష్టం చేశారు.

Advertisement

నిజామాబాద్, బోధన్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi Bodhan Tour) బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని.. తమ బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పోస్టర్లలో రాసి ఉంది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే. ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేశారు. పోస్టర్లలో కర్ణాటకలో కరెంట్ కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు.

Advertisement

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(MLA Pilot Rohit Reddy) ఇంట్లో ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి. తాండూరులోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి రోహిత్ ఇంట్లో 20 లక్షల నగదు, పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బీఆర్ఎస్(BRS) ను గెలిపిస్తే ప్రజల సొమ్మును వాళ్లు లూటీ చేస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) అన్నారు. తెలంగాణలో భూముల వేలంలో 4 వలే కోట్ల అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో, ఔటర్ రింగ్ రోడ్ లీజు వేలంలోనూ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాల్గొన్నారు. అవినీతి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె కొనియాడారు.

జగన్(YS Jagan) కు మళ్లీ 6093 ఖైదీ డ్రెస్ వేసుకునే సమయం వచ్చిందని.. ఇంకెంత కాలం దొంగ సొమ్ముతో మేనేజ్ చేస్తారని టీడీపీ నేత నారా లోకేష్(Nara Lokesh) ప్రశ్నించారు. కోర్టు నోటీసులు వచ్చాయి.. ఇక జగన్ అండ్ కో పని అయిపోయింది అంటూ విమర్శించారు.

ఎన్నికలకు మూడు రోజుల ముందు రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం మరోసారి బయటపడిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు.

మాజీ ప్రధాని పీవీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. ఆయన్ను తీవ్రంగా అవమానించిందని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi)కి అసలు ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు.

ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు(Gujarat Titans) కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆ జట్టు నుంచి వైదొలిగి ముంబై ఇండియన్స్(Mumbai Indians) గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) తర్వాత 15 కోట్లకు హార్ధిక్ ను తీసుకొని ముంబైకి కెప్టెన్ ను చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

తిరుమల శ్రీవారి నడకదారి(Tirumala temple steps)లో నడుస్తూ వెళ్తున్న ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(AP Intelligence DSP Krupakar) గుండెపోటుతో మృతిచెందారు. ఈనెల 26, 27న ప్రధాని మోదీ(PM Modi Tirumala Tour) తిరుమల పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల్లో ఉన్న ఆయన మెట్ల మార్గాన్ని పరిశీలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు.

Recent Posts

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

4 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

5 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

6 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

7 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

8 hours ago

Vijay : విజయ్ కూడా ఉచితాలపైనే ఆధారపడ్డాడా..?

Vijay  : తమిళనాడు Tamila Nadu Politics  రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…

9 hours ago

Hyundai EV Sector : సూప‌ర్ గుడ్‌న్యూస్‌.. ఛార్జింగ్ తో పనిలేకుండా నడిచే వాహనాన్ని తీసుకరాబోతున్న హ్యుందాయ్..!

Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…

10 hours ago

Indiramma Atmiya Bharosa: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇక వారందరీ అకౌంట్లోకి ఏడాదికి రూ.12,000 భరోసా..

Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…

11 hours ago