Tollywood Meeting : సంధ్య థియేటర్ ఘటన అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో నేడు సినీ పెద్దలు తెలంగాణ సీఎంతో మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్ లో దిల్‌రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి, సి.కల్యాణ్, దిల్‌రాజు నేతృత్వంలో 45 మంది సభ్యులు హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, పలువురు సినీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముందుండి ఈ మీటింగ్ నిర్వహణకు లీడ్ తీసుకున్నారు.
ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలకు పలు విషయాలు వివరించారు. ముందుగా సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని సీఎం రేవంత్ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని అన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అని తెలిపారు. ఇక చివర్లో ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని, ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని రేవంత్ చెప్పారు.
సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేదుకు ప్రయత్నిస్తాం అన్నారు అరవింద్. హైదరాబాద్ షూటింగ్ లకు బెస్ట్ స్పాట్ ని ముంబై వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు అని అల్లు అరవింద్ అన్నారు.200ల సినిమాలు తీస్తే అందులో 100 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ అన్నారు. అందులో ఒకటో, రెండో హిట్ అవుతున్నాయని.. సినిమా సక్సెస్ రేటు 1 శాతం మాత్రమే ఉందని ప్రశాంత్ వర్మ అన్నారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని రాఘవేంద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా.. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయని రాఘవేంద్రరావు అన్నారు.
Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్..…
Sonu Sood : సమాజ సేవ చేయడానికి ఎలాంటి అధికారం లేదా పదవి అవసరం లేదని ప్రూవ్ చేశారు నటుడు…
Ram Charan : తమ దగ్గర పనిచేసే పని వాళ్లను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తారు. కొందరేమో వాళ్లని కేవలం…
House Scheme : మధ్యతరగతి ప్రజలకు సరసమైన గృహ సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం. తీసుకొచ్చింది. దీని…
Allu Arjun : పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే అల్లు అర్జున్ మాత్రం అసలేమాత్రం సంతోషంగా…
Dried Apricots : ఈ రకమైన డ్రై ఆఫ్రికాట్లు పోషకాలు అధికంగా ఉంటాయి. వాటి వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా…
Game Changer : గ్లోబల్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు…
This website uses cookies.