Tollywood Meeting : రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్ర‌ముఖ‌ల భేటి.. బెనిఫిట్‌ షోలు ఉండవు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood Meeting : రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్ర‌ముఖ‌ల భేటి..  బెనిఫిట్‌ షోలు ఉండవు

 Authored By ramu | The Telugu News | Updated on :26 December 2024,12:26 pm

ప్రధానాంశాలు:

  •  Tollywood Meeting : రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్ర‌ముఖ‌ల భేటి..  బెనిఫిట్‌ షోలు ఉండవు

Tollywood Meeting : సంధ్య థియేటర్ ఘటన అనంతరం జ‌రిగిన ప‌లు పరిణామాల నేప‌థ్యంలో నేడు సినీ పెద్దలు తెలంగాణ సీఎంతో మీటింగ్ అయ్యారు. ఈ మీటింగ్ లో దిల్‌రాజు, అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, నాగార్జున, త్రివిక్రమ్‌, హరీష్ శంకర్, కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి, సి.కల్యాణ్, దిల్‌రాజు నేతృత్వంలో 45 మంది సభ్యులు హాజర‌య్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు, పలువురు టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు, పలువురు సినీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముందుండి ఈ మీటింగ్ నిర్వహణకు లీడ్ తీసుకున్నారు.

Tollywood Meeting కూల్ వార్నింగ్..

Tollywood Meeting రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్ర‌ముఖ‌ల భేటి బెనిఫిట్‌ షోలు ఉండవు

Tollywood Meeting : రేవంత్ రెడ్డితో ముగిసిన సినీ ప్ర‌ముఖ‌ల భేటి..  బెనిఫిట్‌ షోలు ఉండవు

ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలకు ప‌లు విష‌యాలు వివరించారు. ముందుగా సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం రేవంత్‌ తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని సీఎం రేవంత్ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు. అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని అన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి. డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి అని తెలిపారు. ఇక చివర్లో ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని, ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని రేవంత్ చెప్పారు.

సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేదుకు ప్రయత్నిస్తాం అన్నారు అరవింద్. హైదరాబాద్ షూటింగ్ లకు బెస్ట్ స్పాట్ ని ముంబై వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు అని అల్లు అరవింద్ అన్నారు.200ల సినిమాలు తీస్తే అందులో 100 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ అన్నారు. అందులో ఒకటో, రెండో హిట్ అవుతున్నాయని.. సినిమా సక్సెస్ రేటు 1 శాతం మాత్రమే ఉందని ప్రశాంత్ వర్మ అన్నారు. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని రాఘవేంద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్‌ రాజును ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా.. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయని రాఘవేంద్రరావు అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది