Vangalapudi Anitha : రేయ్ రౌడీ నా కొడకా.. మీ ఇంట్లో అమ్మా అక్కలు లేరా.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వంగలపూడి అనిత
ప్రధానాంశాలు:
ఎర్రమట్టిని తరలిస్తూ కోట్లు కూడబెడుతున్నావా రోజా?
చికెన్ కొట్టును కూడా వదలకుండా మామూళ్లు వసూలు చేస్తున్న రోజా?
చంద్రబాబు కుటుంబ సభ్యులపై వెకిలిగా మాట్లాడుతున్న కొడాలి
Vangalapudi Anitha : వంగలపూడి అనిత గురించి తెలుసు కదా. తను టీడీపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. వైసీపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడటంలో తను నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలపై విమర్శల వర్షం గుప్పించడంలో తన స్టయిలే వేరు. తాజాగా కొడాలి నానిపై వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజం గెలవాలి అనే కాన్సెప్ట్ మీద చంద్రబాబును ఒక అబద్ధం ఈరోజు అరెస్ట్ చేసింది. చంద్రబాబు అనే ఒక నిజానికి.. అబద్ధం అనే జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయించి రిమాండ్ కు పంపించింది. ఈరోజు నిజం గెలవాలి అంటే చంద్రబాబు గెలవాలి. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నది నిజం. కొన్ని కోట్ల మందికి వెలుగు నింపారన్నది నిజం అంటూ వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. కొన్ని వేల మంది యువకులకు భవిష్యత్తు కల్పించారు. కొన్ని కోట్ల మంది మహిళలకు సాధికారిత సాధింపజేశారు అన్నది నిజం. ఇలాంటి నిజాన్ని మాట్లాడితే పింక్ డైమాండ్ అనే ఒక అబద్ధం, కోడి కత్తి అనే మరో అబద్దం.. బాబాయి హత్య రక్త చరిత్ర అనే ఇంకో అబద్ధం.. నిలబడలేక యువగళాన్ని తట్టుకోలేక.. చంద్రబాబును తట్టుకోలేక అక్రమంగా అరెస్ట్ చేయించారు అని జగన్ పై మండిపడ్డారు.
వైసీపీ నేతల అక్రమాలు తవ్వితే వస్తూనే ఉంటాయి. మంత్రి రోజా తెగ ఎగిరి ఎగిరి పడుతున్నారు కదా.. మీ నియోజకవర్గంలోనే ఉన్న విజయపురం అనే మండలంలో కేవలం ఎర్రమట్టిని చెన్నైకి తరలిస్తున్నారు. దీనిపై సీబీఐ ఎంక్వయిరీ చేపిద్దామా రోజక్క. ఎర్రమట్టి అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారు. అసలు నువ్వు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు. చికెన్ కొట్టు వాళ్లను కూడా నువ్వు వదలడం లేదట. వాళ్ల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేస్తున్నారట. బజారు కొట్టు వాళ్ల దగ్గర కూడా మామూళ్లు తీసుకుంటున్నారట. ఇలాంటి నువ్వు నీతులు చెబుతున్నావు. నీ గంజి కథ.. నీ బెంజ్ కథ అందరికీ తెలుసు. ఏమైనా అంటే తిరుపతికి వెళ్తావు. అక్కడికి వెళ్లేది పరమభక్తి కోసం కాదు.. అక్కడ టికెట్లు అమ్ముకోవడానికి వెళ్తుందట. తిరుపతిలో వెళ్లినప్పుడల్లా 30 టికెట్లు అమ్ముకుంటుందట. నీ చేతి వాటం డబ్బులు ఎక్కడ వేసుకోవాలో తెలియక ఏదో ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టావు. నువ్వు వేరే వాళ్ల గురించి మాట్లాడుతున్నావా? అంటూ రోజాపై అనిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Vangalapudi Anitha : బూతులు మాట్లాడటంలో కొడాలి నెంబర్ వన్
భువనేశ్వరి చేస్తున్న యాత్ర గురించి కొడాలి చాలా వెకిలిగా మాట్లాడారు. నేను ఆయనంత వెకిలిగా మాట్లాడలేను కానీ.. నాకు సంస్కారం, సభ్యత ఉన్నాయి. ఇదే జగన్.. జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది వాళ్ల ఇంట్లోని కుటుంబ సభ్యులు కాదా? తల్లి ఏడుస్తూనే రాష్ట్రమంతా తిరిగింది. ఆరోజు తల్లిని, చెల్లిని, ఎన్నికల ప్రచారం కోసం నీ భార్యను కూడా పిలిపించి ప్రచారం చేయించుకున్నావు కదా. మరి నిన్ను ఏమనాలి. మేము కూడా అలాగే మాట్లాడుకోవాలా మీ గురించి. తల్లిని, చెల్లిని వాడుకొని వాళ్ల ఆస్తులు కూడా వాళ్లకు ఇవ్వడం లేదు నువ్వు. మీరు లోకేష్ గురించి, భువనేశ్వరి గురించి మాట్లాడుతున్నారా? రాష్ట్రం మీద మీకు ఏమాత్రం అవగాహన లేకుండా చంద్రబాబును తిట్టాలి.. పవన్ ను తిట్టాలి.. అన్నట్టుగా వెళ్తున్నారు మీరు. మీరు ఎంత తక్కువ ఈ ఫ్యామిలీ గురించి మాట్లాడితే అంత మంచిది. మీరు కుటుంబ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ అనిత సీరియస్ అయ్యారు.
https://www.youtube.com/watch?v=vO0y-hpBe3E