YS jagan : ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోని ఐదుగురు రైతుల్లో ఒక్కరుకూడా రాజధానికి సెంటు భూమి ఇవ్వలేదు.జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తనపై ఉన్నకేసుల విచారణ పూర్తైతే తానెటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో జగన్ ఉన్నాడు. అందుకే చంద్రబాబుని ఏదోరకంగా జైలుకుపంపి, ఆయనకూడా తప్పుచేశాడని ప్రజలతో అనిపించడానికి నానాపాట్లు పడుతున్నాడు అంటూ వర్ల రామయ్య విమర్శించాడు.
అందులో భాగంగానే చంద్రబాబు చేసిన తప్పులను వెతికిపట్టుకున్నవారికి అవార్డులు ఇస్తానని అధికారులకు ఆశచూపాడు. ఆ క్రమంలోనే ఆళ్లరామకృష్ణారెడ్డిఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని వెనకాముందూ ఆలోచించకుండా సీఐడీ చంద్రబాబుకి నోటీసులిచ్చిందని, ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్న ఐదుగురు రైతులు ఎవరూకూడా రాజధానికి వారిభూములివ్వలేదు. వారిలో ఒకడైన జూపూడిజాన్సన్ వైసీపీవిద్యార్థి విభాగం నాయకుడు, అతనిపై కిడ్నాప్ కేసు కూడా ఉందని రామయ్య అన్నాడు.
రాజధానిపరిధిలో లేనివారు, రాజధానికి సెంటుభూమి ఇవ్వనివారు ఫిర్యాదుచేశారని రామకృష్ణారెడ్డిచెబితే, ఏమాత్రం విచారణ జరపకుండా సీఐడీ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడమేంటి? రైతులను మోసగించి, వారితో తప్పుడు సంతకాలు పెట్టించుకున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఛీటింగ్ ఫోర్జరీ కేసులుపెట్టి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తక్షణమే విచారణ జరిపించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశాడు.
చంద్రబాబు స్టేలు ఎందుకు తెచ్చుకుంటాడంటున్న బుద్ధిలేని మంత్రి, జగన్మోహన్ రెడ్డి సీబీఐ, ఈడీకేసుల్లో బెయిల్ కోసం కోర్టులచుట్టూ ఎందుకు తిరిగాడో సమాధానం చెప్పాలి. తనపై ఉన్నకేసులవిచారణ పూర్తయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకుజైల్లోనే ఉండలేదే పనికిమాలిన మంత్రి చెప్పగలడా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగంచేస్తున్న వైసీపీని, ప్రభుత్వాన్ని అదే యాక్ట్ కాలనాగై కాటేస్తుంది.డీజీపీకి బెస్ట్ డీజీపీ అవార్డు రావడం, అనేక అవినీతికేసులున్న జగన్ ముఖ్యమంత్రి కావడంలాంటిదే అంటూ రామయ్య చెణుకులు విసిరాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లుదండుకొని, చట్టానికి చిక్కి సీబీఐతో అరెస్ట్ కాబడి, చంచల్ గూడా జైల్లో 16నెలలు రిమాండ్ ఖైదీగాఉన్నవిషయం 11కేసుల్లో సీబీఐ, 5కేసుల్లో ఈడీ ఆయనపై ఛార్జ్ షీట్లు వేసిన విషయం అందరికీ తెలిసిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.