Amitaab bacchan : ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లో ఎన్నో అవార్డులను.. అలాగే 15 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. ఉత్తమ నటుడుగా 40సార్లు నామినేటవడం ఎంతో గొప్ప విషయం. బాలీవుడ్ లెజెండరీ నటుడు, యాంగ్రీ యంగ్ మాన్ , బాలీవుడ్ షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనగానే గుర్తొచ్చె పేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్. మానవత్వానికి, సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ఈయన దాదాపు 180 పైగా సినిమాలు చేశారు. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటుడని ఎన్నో సందర్భాలలో ప్రముఖులందరు బహిరంగంగా చెప్పిన సందర్భాలున్నాయి. భారతదేశం లోనే కాక పలు దేశాలలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు అమితాబ్ ని ‘ఒన్ మాన్ ఇండస్ట్రీ’ గా వర్ణించారు.
ఒక్క బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్, హలీవుడ్ లో కూడా పేరు ప్రఖ్యాతలని సాధించారు. ఫ్రెంచి డాక్యుమెంటరీ మార్చి ఆఫ్ ది పెంగ్విన్స్ కు తన గాత్రం అందించారు అమితాబ్. భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, పద్మ భూషణ్ తోనూ, పద్మవిభూషణ్ తోనూ గౌరవించింది. ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన “లెగియన్ ఆఫ్ హానర్”తో గౌరవించారు. అమితాబ్ రాజకీయాలలో కూడా తమ ప్రతిభను చాటారు. అమితాబ్ నటునిగానే కాక, నేపధ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ వ్యవహరించారు. అందులో చెప్పుకోదగ్గవి కౌన్ బనేగా కరోడ్ పతి, రియాలిటీ షో బిగ్ బాస్, సోని టివిలో యుధ్ ధారావాహికలో టైటిల్ పాత్రలో నటించారు. హాలీవుడ్ లో మొదటిసారి “ది గ్రేట్ గేట్స్బే” అనే సినిమాతో అడుగుపెట్టారు. గాంభీర్యమైన గాత్రం వల్ల సత్యజిత్ రే , షత్రంజ్ కే ఖిలారీ,లగాన్ అనే సినిమాలకుగాను వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ప్రముఖ హాలీవుడ్ దర్శకనిర్మాతలు, ఆస్కార్ గ్రహీతలు అయిన క్రిస్టోఫర్ నోలాన్.. మార్టిన్ స్కోర్సెస్ స్వయంగా మెగాస్టార్ ని సత్కరించారు. ఈ అవార్డ్ భారతదేశ సినీ వారసత్వాన్ని కాపాడుతున్నందుకు చేసిన కృషికి గానూ ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్ఐఎఎఫ్) అవార్డును మార్టిన్.. నోలన్ వర్చువల్ వేడుక ద్వారా ప్రపంచ సినీ వారసత్వాన్ని కాపాడుతున్నందుకు గాను అమితాబ్ బచ్చన్ కు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్ కలిసే
భాగ్యం తనకు దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసారు. అలాగే హాలీవుడ్ దిగ్గజాలు మార్టిన్.. నోలన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. స్వతహాగ మార్టిన్ సోర్సరర్, నోలాన్ డజన్ల కొద్దీ ఆస్కార్ లు అందుకున్న ప్రముఖుల చేత ఇలాంటి అరుదైన గౌరవం దక్కినందుకుగాను ఇండస్ట్రీ వర్గాలు అమితాబ్ పై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. అంతేకాదు అసలు అమితాబ్ బచ్చన్ లాంటి నటుడు మళ్ళీ పుట్టగలడా..! అంటూ మాట్లాడుకోవడం గొప్ప విషయం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.