Venu Swamy : సీఎం రేవంత్ రెడ్డికి అతిపెద్ద గండం .. వేణు స్వామి సంచలన జోస్యం..!
venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ సంవత్సరంలో జరగబోయే రాజకీయ పరిణామాలపై జోష్యం చెప్పారు. ఇందులో భాగంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకునే ప్రధాన రాజకీయ పరిణామాలను తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని వేణు స్వామి చెప్పారు. కాబట్టి ఆయన అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అందుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోవడం ఉత్తమం అని సూచనలు చేశారు. అంతే కాదు తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు కూడా జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
అలాగే తెలంగాణలో ఓ ముఖ్య నేత కొడుకు యువనేత వ్యక్తిగత జీవితం సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే… అక్కడ మళ్ళీ అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వస్తుందని వేణు స్వామి చెప్పారు. మరో మూడు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశంలో ఒక ముఖ్యమంత్రికి, ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఆరోగ్య భంగంలు కనిపిస్తున్నాయని ఆయన వివరించారు. ఇక ప్రపంచస్థాయి పరిణామాల గురించి చెబుతూ వేణు స్వామి ఓ హెచ్చరిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఓ మహమ్మారి రాబోతుందని అన్నారు. అది ఏదో ఒక రోగం లేదా కరోనా రూపంలో లేదా మరే రూపంలోనైనా ఒక ఉపద్రవం రాబోతుందని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఇది వస్తుందని తెలిపారు. అయితే మన దేశంలో దాని తీవ్రత కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉందని వేణు స్వామి వివరించారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల వేణు స్వామి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన చెబుతున్న జాతకాలు ఇటీవల బెడిసి కొడుతున్నాయి. ప్రభాస్ కెరియర్ పడిపోతుందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ వస్తారని జోష్యం చెప్పారు. కానీ ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోయారు. దీంతో నెటిజన్లు వేణు స్వామి జాతకాలు చెప్పడం మానేయాలంటూ ట్రోల్ చేశారు. అయినా కూడా వాటర్నింటిని కవర్ చేస్తూ వస్తున్నారు వేణు స్వామి.
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
This website uses cookies.