Venu Swamy : 2019లో జగన్ సీఎం అవ్వడానికి కారణం నేనే.. వేణు స్వామి…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 21 May 2024, 5:30 pm

Venu Swamy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేణు స్వామి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల జాతకాలను బయటపెడుతూ రాబోయే ఎన్నికల్లో వారి పరిస్థితి గురించి చెప్పుకొచ్చిన వేణు స్వామి తాజాగా పవన్ కళ్యాణ్ మరియు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ తరఫున పూజలు చేయాలని చాలామంది కోరినట్లు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా పూజలు చేయడం అనేది జరగదని అలా చేసినప్పటికీ ఆ పూజలు ఫలించవని అందుకే నేను పవన్ కళ్యాణ్ కోసం పూజలు చేయట్లేదు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు.

ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ మరి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి కోసం పూజలు చేశారు కదా… ఆ పూజలలో జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు కానీ ఆయన ఎలా సీఎం అయ్యారు అని అడిగారు. ఇక దీనికి వేణు స్వామి సమాధానం ఇస్తూ జగన్ గారి కోసం నేను పూజలు చేసింది వాస్తవమే కానీ ఆ పూజలో జగన్ గారు ఒకసారి వచ్చి కూర్చుని వెళ్లారు. అందుకే ఆ పూజలు పలించి 2019లో ముఖ్యమంత్రిగా జగన్ గారు బాధ్యతలు స్వీకరించారని వేణు స్వామి తెలిపారు. అయితే ఈసారి కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపడతారని వేణు స్వామి తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే జాతకరీత్యా పవన్ కళ్యాణ్ కు ఏలినాటి శని నడుస్తుండటం వలన అలాగే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనేది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కలిసి రాదని వేణు స్వామి తెలిపారు.

Venu Swamy : 2019లో జగన్ సీఎం అవ్వడానికి కారణం నేనే.. వేణు స్వామి...!

Venu Swamy : 2019లో జగన్ సీఎం అవ్వడానికి కారణం నేనే.. వేణు స్వామి…!

వీరిద్దరి కలయిక అనేది జాతకరీత్యా సరిగాలేదని కావున వీరిద్దరి కలయికనేది కూటమికి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తుందంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి