
Ysrcp : అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. హిందూపురం వైసీపీ అభ్యర్థులపై చర్చలు...!
Ysrcp : నాయకుడు ఎవరైనా సరే ప్రజా ప్రతినిధిగా గెలవాలంటే ముందు ప్రజలకు దగ్గరగా ఉండాలి. వారికి అందుబాటులో ఉంటాం అనే భరోసాన్ని కల్పించాలి. సమస్యలు తెలుసుకుని పరిష్కరించగలగాలి.ఇన్ని చేసినా గెలుస్తారు అనే గ్యారెంటీ మాత్రం ఉండదు. చివరిలో ఎక్కడ తేడా కొట్టిన అది ఉల్టా అవుతుంది.మరి వైసీపీ అధిష్టానం ఏ దృష్టితో ఆలోచించిందో తెలియదు కానీ పొలిటికల్ గెస్ట్ ఆర్టిస్టులుగా ఉండే ఇద్దరు మహిళలకు టికెట్ ఇచ్చింది. ఫలితంగా ఓటమిపాలైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు బాధపడుతున్నారట. అయితే హిందూపురం అసెంబ్లీ హిందూపురం పార్లమెంటరీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తేడా జరిగిందని ఇప్పుడు అంటున్నాయి స్థానిక వైసీపీ శ్రేణులు. అసెంబ్లీ స్టేట్ మెంట్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ వంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టాలి అంటే అంతకన్నా బలమైన వారు ఉండాలి కానీ వైసీపీ పార్టీ కురబ దీపిక ను నియోజక వర్గానికి ఇంచార్జ్ గా నియమించింది. కాస్టిక్ పేరుతో వైసీపీ చేసిన ఈ ప్రయోగం అట్టర్ ప్లాప్ అయింది. బాలకృష్ణ క్రేజ్ ముందు ఎవరు నిలవలేకపోయారు కూరబ దీపిక. మరోవైపు బాలయ్య హవ మరోవైపు టీడీపీ వేవ్ కలిసి రావడం తో దీపిక ఓటమి తప్పలేదు.
అయితే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ ఓటమికి రకరకాల కారణాలు కనపడుతున్నాయట. అయితే ఇక్కడ కురబ దీపిక హిందూపుర ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడికి భార్య… కానీ ఆమె ఉండేది మాత్రం బెంగళూరులో. వైసీపీ నుండి టికెట్ రావడంతో హిందూపురానికి మకం మార్చారు. దాదాపు 7 – 8 నెలల పాటు ఆమె ఇక్కడ కష్టపడ్డారు. జనంలోకి బాగా వెళ్లాలి అని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అడపాదడపా తలుక్కుమని మెరిసి వెళ్లడం తప్ప ఓడిన ఇక్కడే ఉంటారు మీకోసం పనిచేస్తారు అని ప్రజలకే కాదు కనీసం పార్టీ కేడర్ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదట. ఇక ఎంపీ అభ్యర్థిని విషయానికి వస్తే బళ్లారి ప్రాంతానికి చెందిన శాంతమ్మను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీటు పరిధిలో గోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఈ రకంగా కలిసి వస్తుందని లెక్కలు కట్టింది వైసీపీ అధిష్టానం. వాస్తవానికి శాంతమ్మ ది గుంతకల్లు ప్రాంతం కానీ చాలా ఏళ్ల క్రితం బళ్లారి ఏరియాలో స్థిరపడ్డారు. ఆమెకు గతంలో ఎంపీగా చేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఎక్కడో కర్ణాటక రాజకీయాల్లో ఉన్న శాంతమ్మను అనూహ్యంగా ఎన్నికల ముందు తీసుకువచ్చారు జగన్. ఎంతోమంది నేతలు ఉన్న వారిని కాదని పక్క రాష్ట్రం నుంచి శాంతమ్మ ను తీసుకువచ్చి నిలబెట్టారు.
Ysrcp : అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. హిందూపురం వైసీపీ అభ్యర్థులపై చర్చలు…!
ఆ ప్రభావం ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. టీడీపీ అభ్యర్థి పార్ధ సారథి భారీ విజయం సాధించారు. పార్దసారధి అన్ని సెగ్మెంట్ లలో పరిచయాలు ఉండడం , ఇక్కడ సీనియర్ నాయకుడు కావడం , అలాగే స్థానిక సమస్యలపై అవగాహన ఉండడం అన్నీ కలిసి వచ్చాయట. శాంతమ్మ విషయానికి వస్తే వీటిలో ఏ ఒక్క క్వాలిటీ లేదు. అందుకే ఓడిపోయారు అనే ప్రచారం జరుగుతుంది. ఓటమి తర్వాత ఆమె కూడా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపించడం లేదు. తిరిగి బళ్లారి వెళ్ళిపోయారు.గెలిచినా ఓడిన జనంలో ఉండే వారికి ఆదరణ దక్కడం చాలా కష్టం. కానీ ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ లేదా ఇతర వ్యూహాలు అంటూ వైసీపీ చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఈ గెస్ట్ ఆర్టిస్టులు కేవలం గెస్ట్ గానే మిగిలిపోతారా లేదా కొన్నాళ్ల తర్వాత అన్నా జనంలోకి వస్తారా అనేది వేచి చూడాలి.
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
This website uses cookies.