Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  అమెరికాలో భారతీయ విద్యార్థిపై అమానుష ప్రవర్తన .. వీడియో వైరల్

  •  ఇండియన్ స్టూడెంట్‌పై దారుణంగా ప్రవర్తించిన అమెరికా అధికారులు

  •  Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యాణా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు విద్యార్థి వీసాతో అమెరికాలో విద్యనభ్యసించేందుకు వచ్చాడు. అయితే అతడిని అమెరికా అధికారులు అకస్మాత్తుగా అరెస్ట్ చేసి, బలవంతంగా ఇండియాకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడిని నేరస్తుడిలా కింద పడేసి, చేతులకు సంకెళ్లు వేసి హింసించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Indian Students US ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం వీడియో వైరల్

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : చేతులకు సంకెళ్లు వేసి, తలను నేలకు అదిమిపట్టి భారత్ స్టూడెంట్ ను కొట్టిన అమెరికా పోలీస్ అధికారులు

ఈ దారుణ ఘటనను న్యూజెర్సీలోని ప్రవాసభారతీయుడు కునాల్ జైన్ తన కెమెరాలో బంధించి ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బాధిత విద్యార్థి హర్యాణ యాసలో “నాకు పిచ్చి లేదు.. నేను ఏ తప్పూ చేయలేదు.. ఈ అధికారులు నన్ను పిచ్చివాడిగా చూపాలని కుట్ర పన్నారు” అంటూ ఏడుస్తూ పోలీసులకు ఎదురుతిరిగిన దృశ్యం కనిపిస్తుంది. ఒక పోలీసు అధికారి అతడి మీద కూర్చుని దయనీయంగా మనదృక్పదం పక్కనపెట్టి వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఎవరి మనసైనా కలచివేస్తోంది.

ఈ ఘటనపై అమెరికా ప్రవాస భారతీయులతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “చదువుకునేందుకు వచ్చిన ఒక నిర్భాగ్య విద్యార్థిని నేరస్తుడిలా హింసించడమా? ఇదేనా అమెరికా వేధింపులకు వ్యతిరేకంగా నిలబడే దేశం?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ హయాంలో అభివృద్ధిచెందిన కఠిన వలస విధానం ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి