Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యాణా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు విద్యార్థి వీసాతో అమెరికాలో విద్యనభ్యసించేందుకు వచ్చాడు. అయితే అతడిని అమెరికా అధికారులు అకస్మాత్తుగా అరెస్ట్ చేసి, బలవంతంగా ఇండియాకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడిని నేరస్తుడిలా కింద పడేసి, చేతులకు సంకెళ్లు వేసి హింసించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !
ఈ దారుణ ఘటనను న్యూజెర్సీలోని ప్రవాసభారతీయుడు కునాల్ జైన్ తన కెమెరాలో బంధించి ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బాధిత విద్యార్థి హర్యాణ యాసలో “నాకు పిచ్చి లేదు.. నేను ఏ తప్పూ చేయలేదు.. ఈ అధికారులు నన్ను పిచ్చివాడిగా చూపాలని కుట్ర పన్నారు” అంటూ ఏడుస్తూ పోలీసులకు ఎదురుతిరిగిన దృశ్యం కనిపిస్తుంది. ఒక పోలీసు అధికారి అతడి మీద కూర్చుని దయనీయంగా మనదృక్పదం పక్కనపెట్టి వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఎవరి మనసైనా కలచివేస్తోంది.
ఈ ఘటనపై అమెరికా ప్రవాస భారతీయులతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “చదువుకునేందుకు వచ్చిన ఒక నిర్భాగ్య విద్యార్థిని నేరస్తుడిలా హింసించడమా? ఇదేనా అమెరికా వేధింపులకు వ్యతిరేకంగా నిలబడే దేశం?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ హయాంలో అభివృద్ధిచెందిన కఠిన వలస విధానం ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
This website uses cookies.