RCB : కప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయనుందా..?
RCB : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో 11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి.. ఆర్సీబీని ఏకంగా ఎఫ్ఐఆర్‌లో చేర్చడమే కాకుండా మార్కెటింగ్ హెడ్‌ను కూడా అరెస్టు చేసింది.
RCB : కప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయనుందా..?
ఇక ఆర్సీబీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోనూ టెన్షన్ మొదలైంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ఘటనపై ఇది వరకే స్పందించారు. విక్టరీ పరేడ్ అనేది ఆర్సీబీ ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ.. ఈ దేశంలో క్రికెట్ అనేది బీసీసీఐ అధీనంలో ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీసీసీఐ చూస్తూ ఊరుకుండలేదని తేల్చి చెప్పారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆర్సీబీ తోపులాట ఘటనపై స్పందించాడు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్న ఆయన.. రోడ్ షోలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకపోవడమే మంచిదన్నాడు. ఇవి చూస్తుంటే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో కఠినతరమైన రూల్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు.విచారణలో ఈ ఘటనకు ముఖ్య కారణం ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అనే తేలితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం చేయకుండా ఒక ఏడాది పాటు బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.