Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి…!

Tirumala : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రాజ‌కీయంగా హీట్ పెంచింది. జ‌గ‌న్‌ శ్రీవారి దర్శనానికి వెళ్తుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్‌ కోరినట్లే మాజీ సీఎం జగన్‌ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి హిందూ మతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అయితే అన్యమతస్తులు ఎవరైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 September 2024,2:18 pm

ప్రధానాంశాలు:

  •  Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి...!

Tirumala : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రాజ‌కీయంగా హీట్ పెంచింది. జ‌గ‌న్‌ శ్రీవారి దర్శనానికి వెళ్తుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్‌ కోరినట్లే మాజీ సీఎం జగన్‌ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి హిందూ మతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అయితే అన్యమతస్తులు ఎవరైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే వారు తమ వివరాల్ని పేర్కొంటూ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి తీరు ఒక్క తిరుమలలోనే కాదు. ఏ మతానికైనా ఉంటుంది. అన్య మతస్తులు తమ ప్రార్థనాలయాల్లోకి ప్రవేశించేందుకు పరిమితులు ఉంటాయి. తాము సదరు మతాన్ని, వారి విశ్వాసాల్ని విశ్వసిస్తామన్న ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుంది.

అదే రీతిలో తిరుమలలో కూడా అలాంటి విధానాన్నే ఫాలో అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్యమతస్తులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తమకు తాము స్వచ్ఛదంగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ చట్టంలోని 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది.దీని ప్రకారం హిందువులు కాని అన్యమస్తులు ఎవరైనా సరే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఆలయంలోకి వెళ్లటానికి ముందే హిందూ మతాన్ని.. విశ్వాసాల్ని విశ్వసిస్తానంటూ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి చెందిన వ్యక్తినని.. అయినప్పటికీ శ్రీవేంకటేశ్వరస్వామిపై తనకు నమ్మకం.. గౌరవం ఉన్నాయని. అందుకే దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తమ వివరాల్ని నమోదు చేసి.. సంతకం పెట్టి టీటీడీకి ఇవ్వాల్సి ఉంటుంది.

తిరుమలకు అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కచ్చితంగా అఫిడవిట్‌ సమర్పించాలని టీటీడీ నిబంధనలు చెబుతున్నాయి. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ నిబంధనను అనుసరించి హిందువులు కాని వ్యక్తులు/అన్యమతస్థులు.. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్‌ ఫారంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని.. అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి, సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటూ పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Tirumala తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి

Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి…!

తిరుమల వచ్చే అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్‌మెంటు దగ్గర డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే గెస్ట్‌హౌస్ దగ్గరకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్‌ శుక్రవారం తిరుమల వస్తే గెస్ట్‌హౌస్‌ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్‌పై సంతకం కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది