Pastor Praveen Pagadala : రామ్మోహన్ ఎవరు..? అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్..!
Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ ఎలా మరణించారని తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు పోస్టుమార్టం నివేదిక అందుతుందని, దాని ద్వారా మరింత సమాచారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో కూడిన ప్రత్యేక బృందం ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తోంది. మార్చి 26 నుంచి 28 వరకు చాగల్లులోని రక్షణ సువార్త మహాసభల్లో ఆయన ప్రసంగించాల్సి ఉండగా, ఒక్కరోజు ముందుగానే మార్చి 24న అక్కడకు వెళ్లడం అనుమానాలకు దారి తీసింది.
Pastor Praveen Pagadala : రామ్మోహన్ ఎవరు..? అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్..!
పోలీసుల దర్యాప్తులో ప్రవీణ్ చివరి కాల్ రాజమండ్రి సీటీఆర్ఐ చర్చి పాస్టర్ రామ్మోహన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏమిటన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రవీణ్-రామ్మోహన్ కలిసి ‘యూత్ విత్ బైబిల్ మిషన్’ అనే సంస్థను నడిపినట్లు సమాచారం. ఈ మిషన్ ఆధ్వర్యంలో బైబిల్ కాలేజీ వ్యవహారాలను చర్చించేందుకు ప్రవీణ్ ముందుగానే వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రవీణ్ అకస్మాత్తుగా మరణించడంపై అతని కుటుంబ సభ్యులు, శిష్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంతో చాగల్లులో జరగాల్సిన క్రైస్తవ మహాసభలు నిలిచిపోయాయి. ధర్మవరానికి చెందిన పాస్టర్ శామ్యూల్ ఆ మహాసభలకు ప్రవీణ్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. మార్చి 24న ప్రవీణ్ మరణించడంతో మార్చి 26 నుంచి 28 వరకు జరుగాల్సిన ఈ సభలు అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. పోలీసులు ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే మరిన్ని విషయాలు వెలుగులోకి రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రవీణ్ మృతి కేసు క్రైస్తవ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.