Pastor Praveen Pagadala : రామ్మోహన్‌ ఎవరు..? అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pastor Praveen Pagadala : రామ్మోహన్‌ ఎవరు..? అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pastor Praveen Pagadala : రామ్మోహన్‌ ఎవరు..? అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్..!

Pastor Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ ఎలా మరణించారని తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు పోస్టుమార్టం నివేదిక అందుతుందని, దాని ద్వారా మరింత సమాచారం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది. ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో కూడిన ప్రత్యేక బృందం ప్రవీణ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తోంది. మార్చి 26 నుంచి 28 వరకు చాగల్లులోని రక్షణ సువార్త మహాసభల్లో ఆయన ప్రసంగించాల్సి ఉండగా, ఒక్కరోజు ముందుగానే మార్చి 24న అక్కడకు వెళ్లడం అనుమానాలకు దారి తీసింది.

Pastor Praveen Pagadala రామ్మోహన్‌ ఎవరు అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్

Pastor Praveen Pagadala : రామ్మోహన్‌ ఎవరు..? అనుమానాలు పెంచేస్తున్న ప్రవీణ్ లాస్ట్ కాల్..!

Pastor Praveen Pagadala రామ్మోహన్‌ ఎవరు..? పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొత్త కొత్త అనుమానాలు

పోలీసుల దర్యాప్తులో ప్రవీణ్ చివరి కాల్ రాజమండ్రి సీటీఆర్ఐ చర్చి పాస్టర్ రామ్మోహన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం ఏమిటన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రవీణ్-రామ్మోహన్ కలిసి ‘యూత్ విత్ బైబిల్ మిషన్’ అనే సంస్థను నడిపినట్లు సమాచారం. ఈ మిషన్ ఆధ్వర్యంలో బైబిల్ కాలేజీ వ్యవహారాలను చర్చించేందుకు ప్రవీణ్ ముందుగానే వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రవీణ్ అకస్మాత్తుగా మరణించడంపై అతని కుటుంబ సభ్యులు, శిష్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంతో చాగల్లులో జరగాల్సిన క్రైస్తవ మహాసభలు నిలిచిపోయాయి. ధర్మవరానికి చెందిన పాస్టర్ శామ్యూల్ ఆ మహాసభలకు ప్రవీణ్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. మార్చి 24న ప్రవీణ్ మరణించడంతో మార్చి 26 నుంచి 28 వరకు జరుగాల్సిన ఈ సభలు అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. పోలీసులు ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే మరిన్ని విషయాలు వెలుగులోకి రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రవీణ్ మృతి కేసు క్రైస్తవ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది