AP Elections 2024 : ఏపీకి కాబోయే సీఎం ఎవరో తేల్చేసిన జాతీయ సర్వే…!
AP Elections 2024 : ఏపీకి కాబోయే సీఎం ఎవరు అని అడిగితే.. 2024 ఎన్నికలకు వరకు ఆగాల్సిందే అని అంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు. ఏ పార్టీ గెలుస్తుంది అనేది చెప్పగలరా? నిజానికి ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న విషయం తెలుసు కదా. ఇప్పటికే రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచి మూడో సారి కూడా అక్కడ హ్యాట్రిక్ సాధించాలని తెగ ఆరాటపడుతోంది. ఇక.. మరో నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాంలోనూ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలుసు కదా. ఇక.. ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఈ ఐదు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. పార్లమెంట్ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి. అందుకే ఒకసారి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఏపీ సమాయత్తం అవుతోంది. అయితే.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఒకసారి గెలిచిన వైసీపీకి మరోసారి ప్రజలు బ్రహ్మరథం పడతారా? లేక 2019 ఎన్నికల్లో ఓడించిన టీడీపీకి లాస్ట్ చాన్స్ ఇస్తారా? లేక ఒక్క చాన్స్ అంటూ అటూ ఇటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ పార్టీకి పట్టం కడతారా అనేది తెలియడం లేదు.ఎన్నికల ముందు సర్వేలు నిర్వహించడం కామనే కదా. ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఎన్నికలకు 6 నెలల ముందు, సంవత్సరం ముందు నుంచే కొన్ని పార్టీలు సర్వేలు నిర్వహించుకుంటాయి. కొన్ని సంస్థలు కూడా స్వతంత్రంగా సర్వేలు నిర్వహిస్తాయి. అందులో ఇండియా టీవీ సీఎన్ఎక్స్ కూడా ఉంది. అది ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్ బయటికొచ్చింది.
AP Elections 2024 : ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఏమంటోందంటే?
కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తాయ.. ఇతర రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే విషయాలపై కుండ బద్దలు కొట్టింది ఆ సంస్థ. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పింది. అంటే.. మూడోసారి ప్రధానిగా మోదీనే అవ్వబోతున్నారన్నమాట. ఇక.. ఏపీ విషయానికి వస్తే.. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందులో 18 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందట. టీడీపీకి ఏడు మాత్రమే వస్తాయట. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాదట. 18 స్థానాల్లో వైసీపీ గెలవబోతోందంటే.. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ గెలవబోతున్నట్టే కదా.