ABN Radhakrishna : ఏబీఎన్ రాధాకృష్ణ – అమిత్ షా లు కలవడం వెనక ఇదన్నమాట అసలు కారణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ABN Radhakrishna : ఏబీఎన్ రాధాకృష్ణ – అమిత్ షా లు కలవడం వెనక ఇదన్నమాట అసలు కారణం

 Authored By kranthi | The Telugu News | Updated on :15 June 2023,6:00 pm

ABN Radhakrishna : ఏబీఎన్ రాధాకృష్ణ తెలుసు కదా. ఆయన తెలుసు.. ఆయన పచ్చ మీడియా వ్యవహారాలు కూడా అందరికీ తెలుసు. ఆయన పచ్చ మీడియా పేరుతో రాసే రాతలు కూడా అందరికీ తెలుసు. ఆయన రాతల వల్లనే కావచ్చు.. చివరకు కేంద్ర హోంమంత్రి కూడా ఇప్పుడు రాధాకృష్ణను కలిసేలా చేసింది. అవును.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంటికి కూడా వెళ్తున్నారు. నిజానికి.. అమిత్ షా చాలామంది ప్రముఖులను కలుస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఏబీఎన్ రాధాకృష్ణను కూడా కలుస్తున్నారేమో. దర్శక ధీరుడు రాజమౌళిని కూడా కేంద్ర హోంమంత్రి కలవబోతున్నారు అనే విషయం తెలుసు కదా.

మరీ.. ఒక్కరినే కలిస్తే బాగుండదు అని అనుకున్నారో ఏమో కానీ.. ఇప్పుడు రాధాకృష్ణను కూడా కలవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ.. బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోందా. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు.. ఏకంగా ఢిల్లీకి వెళ్లి మంతనాలు కూడా జరిపారు. దాని ఎఫెక్టేనా అనేది అర్థం కావడం లేదు. కొంపదీసి బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా? అందుకే పచ్చ మీడియా బ్యాచ్ తో హోంమంత్రి అమిత్ షా భేటీ అవుతున్నారా? అనేది తెలియడం లేదు.

why amit shah meets abn radha krishna

why amit shah meets abn radha krishna

ABN Radhakrishna : 2014 లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కష్టపడ్డవారిలో రాధాకృష్ణ కూడా ఒకరు

2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి పరోక్షంగా సాయపడిన వాళ్లలో ఏబీఎన్ రాధాకృష్ణ కూడా ఒకరు. చంద్రబాబును అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి శాయశక్తులా పచ్చ మీడియా బ్యాచ్ తో కలిసి రాధాకృష్ణ తెగ కష్టపడ్డారు. అంటే.. ఇప్పుడు మళ్లీ ఆ అవసరం వచ్చిందా? ఏపీలో బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు గెలవడం కోసం మళ్లీ రాధాకృష్ణ కష్టపడాలా? అందుకే అమిత్ షా భేటీ కాబోతున్నారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అంటే ఇప్పుడు రాధాకృష్ణ కింగ్ మేకర్ అన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది