Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి

 Authored By sandeep | The Telugu News | Updated on :19 January 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah ప‌ర్య‌ట‌న ఏపీలో బిజీ బిజీగా న‌డుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandra Babu Naidu శనివారం రాత్రి తన నివానంలో విందు ఏర్పాటు చేశారు. ఏసీ సీఎం ఇచ్చిన విందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan , లోకేశ్ Nara Lokesh సహా మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. . విశాఖ ఉక్కుకు కేంద్రం బారీ ప్యాకేజీ ప్రకటించిన మరునాడే అమిత్ షా ఏపికి రావడంతో అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా షా టూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని తమకు తెలుసున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకునే ప్యాకేజీని ప్రకటించామని అన్నారు…

Amit Shah ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌ చంద్ర‌బాబు ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి

Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి

Amit Shah : అన్నింటిపై ఆరా..

ఎన్టీఆర్‌కు Sr Ntr భారతరత్న ఇవ్వాలని కోరిన చంద్రబాబు Chandrababu .. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు  Congress వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలను ఆయన ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ SR NTR కు భారతరత్న కోరుతూ కేంద్రానికి వినతిపత్రం అందజేశామని ఎంపీ పురందేశ్వరి గుర్తుచేశారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్‌ గొప్ప నేతని, భారతరత్నకు ఆయన అన్నివిధాలా అర్హులని వ్యాఖ్యానించారు. కాగా, విందులో పలు అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల గురించి కూడా కేంద్ర హోం మంత్రి ఆరా తీశారు. భూముల ధరల గురించి ప్రస్తావన రాగా..‘ ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో ఐదు ఎకరాలు వచ్చేది… ఇప్పుడు అక్కడ ఒక ఎకరం అమ్మితే.. ఇక్కడ యాభై ఎకరాలు కొనొచ్చు’ అని చంద్రబాబు చెప్పారు.

నాడు కాంగ్రెస్ పార్టీ నిత్యం సీఎంలను మారుస్తూ సాగిన వైనాన్ని ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక కాలం సీఎంగా పనిచేసింది ఎవరు? అంటూ షా ఆరా తీశారు. దీంతో ఏమాత్రం తడుముకోని చంద్రబాబు… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని తెలిపారు. వైఎస్ Ys Rajashekar reddy ఏకంగా ఆరేళ్లపాటు సీఎంగా పనిచేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఒకింత ఎక్కువ కాలమే సీఎంగా పనిచేశారని తెలిపారు. ఈ భేటిలో వైఎస్ ప్ర‌స్తావ‌న రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విందు భేటీలో అమిత్‌షా జగన్‌ ప్యాలెస్‌ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్‌పాండ్‌, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని లోకేశ్‌ అమిత్‌షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్‌లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేశ్ Nara Lokesh బదులిచ్చారు

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది