BRS Party : గత పదేండ్లుగా తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు ఘోరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ ఎస్ టికెట్ వస్తే చాలు కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అంటూ అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ చెప్పుకునేవారు. కానీఇప్పుడు కాలంమారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత పార్టీ ప్రతిష్ట గంగలో కలిసిపోతోంది. ఇప్పుడు పిలిచి మరీ టికెట్లు ఇస్తున్నా సరే ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రావట్లేదు. మాకు టికెట్లు వద్దు బాబోయ్ అంటూ కాంగ్రెస్, బీజేపీ బాట పడుతున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ ఎస్ కు వరుసగా షాక్ లుతగులుతున్నాయి.అటు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. దాంతో పాటు భూ కబ్జాల ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులు ఇప్పుడు బీఆర్ ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఈ దెబ్బతో బీఆర్ ఎస్ ను అందరూ వీడి వెళ్లిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే బీఆర్ ఎస్ లో సీనియర్లుగా ఉన్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ బాట పడుతున్నారు. సునీత, మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, కే.కేశవరావు ఇప్పుడు కడియం శ్రీహరి.. ఇలా పార్టీలో చాలా బలమైన లీడర్లుగా ఉన్న వారే ఇప్పుడు కాంగ్రెస్ బాట పడుతున్నారు. మరి ఇలా సీనియర్లు, కేసీఆర్ ఎంతో పదవులు ఇచ్చిన వారేఎందుకు వీడుతున్నారు.అంటే వీరంతా ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. గతపదేండ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి బీఆర్ ఎస్ లోకి వచ్చిన వారే ఇప్పుడు పార్టీని వీడుతున్నారు.
దాంతో ఇప్పుడు కేసీఆర్ కు సొంత నాయకత్వం అంటూ లేకుండాపోయింది. ఒకసారి పార్టీలు మారి పదవులు అనుభవించిన వారికి.. మరోసారి పార్టీ మారి పదవులు అనుభవించాలనే ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు బీఆర్ ఎస్ పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. అందుకే వారంతా ఇప్పుడు బీఆర్ ఎస్ ను వీడి వెళ్లిపోతున్నారు. ఇదే కేసీఆర్ చేసిన అతిపెద్ద పొరపాటు.ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పెద్ద పీట వేశాడు. అంతే గానీ.. ఉద్యమ కాలంలో తన వెనకాల నడిచిన వారిని పట్టించుకోలేదు. అదే పెద్ద దెబ్బ తీసింది. సొంత నాయకత్వాన్ని తయారు చేసుకోకపోవడమే ఇప్పుడు ఆయన్ను దారుణమైన దెబ్బ కొట్టిందని అంటున్నారు రాజకీయ నిపుణులు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.