Kadiyam Kavya : BRS కు కడియం కావ్య రాజీనామా చేయడానికి ముఖ్య కారణాలేంటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kadiyam Kavya : BRS కు కడియం కావ్య రాజీనామా చేయడానికి ముఖ్య కారణాలేంటి…?

Kadiyam Kavya : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీ.ఆర్.ఎస్ కు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు షాక్ లు ఇస్తూనే ఉన్నారు బీ.ఆర్.ఎస్ అభ్యర్థులు. అందులో భాగంగా ఇప్పుడు మరో షాక్ తగిలింది అని చెప్పాలి. అయితే ఇటీవల బీ.ఆర్.ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ను ప్రకటించగా..ఇప్పుడు ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాను వరంగల్ ఎంపీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Kadiyam Kavya : BRS కు కడియం కావ్య రాజీనామా చేయడానికి ముఖ్య కారణాలేంటి...?

Kadiyam Kavya : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీ.ఆర్.ఎస్ కు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తరువాత మరొకరు షాక్ లు ఇస్తూనే ఉన్నారు బీ.ఆర్.ఎస్ అభ్యర్థులు. అందులో భాగంగా ఇప్పుడు మరో షాక్ తగిలింది అని చెప్పాలి. అయితే ఇటీవల బీ.ఆర్.ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ను ప్రకటించగా..ఇప్పుడు ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాను వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకుంటున్నట్లు గా కే.సీ.ఆర్ లేఖ ధ్వారా తన నిర్ణయాన్ని వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతా సవ్యంగా జరుగుతుందని అనుకునే సమయంలో కావ్య ఇలాంటి బాంబు పేల్చడంతో బీఆర్ఎస్ పార్టీకి తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఏం జరుగుతుందో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొల్పింది. దీనితో బి ఆర్ ఎస్ పార్టీ మనుగడ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

ఇక కావ్య బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు లేఖ రాశారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ లేఖ ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్ది రోజుగా అవినీతి ఆరోపణలు, ఫోన్ టాపింగ్, లిక్కర్ స్కామ్, భూకబ్జాలు వంటి విషయాల వలన పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసింది. దీనివల్ల పార్టీ పరువు గంగలో కలుస్తుంది. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సమన్వయం, ఏమాత్రం మంచిగా లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా అభిప్రాయ విభేదాలు కనబరుస్తున్నాయి. దీనివల్ల నేతల మధ్య సఖ్యత ఉండడం లేదు. మరియు విమర్శల దాడి పెరగడంతో పార్టీ ప్రతిష్ట మసకబారిపోతుంది అని చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో పార్టీలో ఉండాలని నేనుఅనుకోవడం లేదంటూ కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. అయితే బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడానికి చాలా కారణాలు ప్రభావితం చేస్తున్నాయి.

దీనితో పార్టీకి నాయకత్వ సంస్థ ఏర్పడుతుంది. దీనివల్ల కెసిఆర్ నీ నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు అని తెలుస్తుంది. వీటితోపాటు ఇతర పార్టీ నేతల ఆరోపణలు కూడా పార్టీ ను నివేదిస్తున్నాయి. విమర్శల దాడి పెరుగుతుంది. దీనివల్ల పార్టీకి చాలా నష్టం కలిగె అవకాశం ఉంది. అలాగే కవిత అరెస్టుతో పార్టీ నష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుత ఈ అంశం కేసీఆర్ ముందు ఒక సవాల్ గా మారింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు అనే అంశంపై ,ఉత్కంఠత కొనసాగుతుందని చెప్పాలి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ కనీస సీట్లు కూడా సాధించే అవకాశం తక్కువేనని పలువురు చెప్పుకొస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది