Amit Shah : టార్గెట్ తెలంగాణ వరకూ బానే ఉంది అమిత్ షా జీ.. ఏపీలో ఏం పొడిచేద్దాము అని.. ?
Amit Shah : బీజేపీ అంటేనే మనకు గుర్తొచ్చేది నార్త్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. మొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉండేది కానీ.. ఇప్పుడు కర్ణాటక కూడా చేజారిపోయింది. దీంతో సౌత్ ఇండియా తన గుప్పిట్లో నుంచి పోయినట్టే. ఇక త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం తన టార్గెట్ ను తెలుగు రాష్ట్రాలకు షిఫ్ట్ చేసింది బీజేపీ. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్ కు సూచించింది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ హైకమాండ్ తెగ పర్యటనలు చేస్తోంది. శ్రీకాళహస్తిలో మొన్నటి భారీ బహిరంగ సభ కూడా అందుకే.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా వరుసగా ఏపీలో పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఏపీ మీద ఫోకస్ చేశారు. ఇద్దరు బడా నేతలు ఇలా ఏపీలో వరుసగా పర్యటనలు చేస్తుంటే వీళ్లు ఏపీ మీద ఎంత ఫోకస్ పెట్టారో అర్థం అవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు ఇప్పటి నుంచే వీళ్లు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో పొత్తుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో బీజేపీ అగ్రనేతల ఏపీ పర్యటన సర్వత్రా ఆసక్తి రేకిస్తోంది.
Amit Shah : ఏపీపై నడ్డా, అమిత్ షా స్పెషల్ ఫోకస్
ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ ఆసక్తిని జేపీ నడ్డా, అమిత్ షా పెట్టారు. వాళ్ల ఆధ్వర్యంలోనే ఏపీ ఎన్నికల్లో బీజేపీ ముందుకు వెళ్లనుంది. అయితే.. ఇటీవలే చంద్రబాబు… అమిత్ షా, నడ్డాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏపీ పర్యటనకు రావడం మాత్రం ఇదే తొలిసారి. నిజానికి.. 2019 ఎన్నికల ముందు వరకు బీజేపీ, టీడీపీ కలిసే ఉండేవి. కానీ.. 2018 లో ఎన్డీఏ నుంచి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీతో చంద్రబాబు మాట్లాడలేదు. తాజాగా ఎన్నికలకు సంవత్సరం ఉందనగా.. చంద్రబాబు బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. మరోవైపు పొత్తుల విషయం పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా బీజేపీ పావులు కదుపుతోంది. అది వర్కవుట్ అవుతుందా లేదా.. అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.