Pawan Kalyan : తన మనసులో మాట చెప్పేసి అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్ !
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో అందరూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం.. వారాహి యాత్ర పేరుతో పవన్ చేస్తున్న రాజకీయం. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. కానీ.. పవన్ కళ్యాణ్ అంటేనే మనకు గుర్తొచ్చేది పొత్తులు. ఇప్పటికే పలు పార్టీలతో పొత్తు పెట్టుకొని దెబ్బతిని ఉన్నారు పవన్. అయినా కూడా తాను మళ్లీ పొత్తుల గురించి మాట్లాడటం దేనికి సంకేతం.సరే.. అవన్నీ పక్కన పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడైనా వింటే ఆయన ప్రతి విషయాన్ని ఒకే దృక్పథంతో చూస్తున్నట్టు అర్థం అవుతుంది.
అదే.. క్విడ్ ప్రోకో. అవును.. క్విడ్ ప్రోకో అంటే తెలుసు కదా. అప్పట్లో ఈ పదం చాలా ఫేమస్. క్విడ్ ప్రోకో అంటే.. నేను నీకు ఈ పని చేస్తే.. నువ్వు నాకు ఏం చేస్తావు. ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. పవన్ వ్యాఖ్యలు అన్నీ అలాగే ఉన్నాయి. అంటే.. ముందు మీరు నాకోసం ఏం చేస్తారు.. నన్ను మీరు ముఖ్యమంత్రిని చేస్తేనే నేను మీకు ఏదైనా చేయగలుగుతా. ఇదిగో ఇలా ఉంటాయి ఆయన మాటలు. అంటే.. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా ప్రజలనే నిందించేలా ఉన్నారు పవన్.మీరు నన్ను సీఎం చేయండి.. మీ కష్టాలు నేను తీర్చుతా.. అంటూ పవన్ కళ్యాణ్ ఒకటే పాట పాడుతున్నారు. అంటే.. తనను సీఎం చేస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయా? లేకపోతే తీరయా? 2019 ఎన్నికల విషయంలోనూ అలాంటి వ్యాఖ్యలే చేశారు పవన్.
Pawan Kalyan : నన్ను సీఎం చేయండి.. నేను మీ కష్టాలు తీర్చుతా
తనను గాజువాక ఎమ్మెల్యేగా అప్పుడు గెలిపించి ఉంటే.. ఇప్పుడు వైజాగ్ లో జరిగే అరాచకాలను అడ్డుకొని ఉండేవాడిని అంటూ వ్యాఖ్యానించారు. అంటే.. ఎప్పుడు చూసినా పదవి కావాలంటూ రంకెలేస్తున్నారు పవన్. అంటే.. ప్రజలు తనను గెలిపిస్తేనే ఏదో ఒకటి చేస్తానని డైరెక్ట్ గానే హింట్ ఇస్తున్నారు పవన్. గాజువాకలో ఓడిపోయినంత మాత్రాన విశాఖలో జరిగే అరాచకాలను అడ్డుకోకూడదా? గెలిస్తేనే అడ్డుకోవాలా? గెలిస్తేనే అడ్డుకుంటారా? లేకపోతే అడ్డుకోరా? ఇలాంటి వ్యాఖ్యలు చేసి పవన్ తనను తానే తక్కువ చేసుకుంటున్నారు. తన చవకబారు మాటలకు పడిపోవడానికి జనాలేమీ పిచ్చోళ్లు కాదు. వాళ్లు చాలా చైతన్యవంతులు. పవన్ ను ఏం చేయాలో వాళ్లకే తెలుసు.