YS Jagan : 30 ఇయర్స్ పృథ్వీ భార్య భరణం విషయంలో వైఎస్ జగన్ స్పందన?
YS Jagan : 30 ఇయర్స్ పృథ్వీ తెలుసు కదా. ఆయన విషయం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకోగానే టీటీడీ అధ్యాత్మిక చానెల్ అయిన ఎస్వీబీసీకి చైర్మన్ గా పృథ్వీని నియమించారు. అసలు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఆయనకు ఇవ్వడం ఏంటంటూ అందరూ షాక్ అయ్యారు. కానీ.. చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి కారణం ఓ మహిళా ఉద్యోగిని అని తెలిసింది. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అవడంతో దానిపై విచారణ చేపట్టిన ఏపీ ప్రభుత్వం.. వెంటనే పృథ్వీని ఆ పదవి నుంచి తప్పించింది.
అప్పటి నుంచి వైఎస్ జగన్ ను కలిసేందుకు పృథ్వీ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పార్టీ నుంచి బయటికి వచ్చేసి జగన్ పై విమర్శలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు తన భార్యకు నెలకు 8 లక్షల రూపాయలు భరణంగా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే.. తనకు సినిమా ఇండస్ట్రీలో పేరు రాగానే తన భార్యను పుట్టింటికి పంపించేశాడట పృథ్వీ. తనకు సినిమా అవకాశాలు రానప్పుడు భార్య సంపాదన మీద బతికి, మామ సంపాదన మీద బతికి ఇప్పుడు వాళ్లను పట్టించుకోకుండా వదిలేశాడని తన భార్య కోర్టుకెక్కింది.
YS Jagan : ప్రస్తుతం పృథ్వీ నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడా?
ప్రస్తుతం పృథ్వీ నెలకు రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నాడని, అందుకని తనకు భరణంగా కొంత ఇవ్వాలని తన భార్య కోర్టుకు విన్నవించుకుంది. దీంతో తన భార్యకు నెలకు రూ.8 లక్షల భరణం ఇవ్వాలని పృథ్వీని ఆదేశిస్తుంది కోర్టు. ఏది ఏమైనా అసలు కోర్టు తీర్పు వెలువడ్డాక కానీ.. పృథ్వీ ఏంటో.. అతడి అసలు స్వరూపం ఏంటో బయటపడింది. ప్రస్తుతం పృథ్వీ వైసీపీలో లేడు. జనసేనలో ఉన్నాడు. ఒకవేళ పృథ్వీ జనసేనలో కాకుండా వైసీపీలో ఉండి ఉంటే.. ప్రతిపక్షాలు పృథ్విని కాకుండా సీఎం జగన్ మీదనే విమర్శలు చేసేవారు. ఏది ఏమైనా పృథ్వీ విషయంలో అప్పట్లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అందరూ అంటున్నారు.